Hardik Pandya (Photo credit: Twitter)

ఐపీఎల్లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ అదిరిపోయే ఆటతో తిరిగి అగ్రస్థానానికి చేరింది. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది.

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (52 బంతుల్లో 87 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. అభినవ్‌ మనోహర్‌ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (14 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) దంచికొట్టారు. అభినవ్‌తో నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించిన హార్దిక్‌.. అజేయమైన ఐదో వికెట్‌కు మిల్లర్‌తో కలిసి 25 బంతుల్లోనే 53 పరుగులు జతచేయడం విశేషం. రాజస్థాన్‌ బౌలర్లలో చాహల్‌, పరాగ్‌, కుల్దీప్‌ సేన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై, 12 పరుగుల తేడాతో ముంబైకి షాకిచ్చిన పంజాబ్‌ కింగ్స్‌, ఐపీఎల్‌ సీజన్‌లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఓడిన తొలి జట్టుగా ముంబై రికార్డు

193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. జాస్‌ బట్లర్‌ 54 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. హెట్‌మైర్‌ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. గుజరాత్‌ బౌలర్లలో యష్‌ దయాల్, ఫెర్గూసన్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. హార్దిక్‌ పాండ్యా , మహ్మద్‌ షమీ చెరొక వికెట్‌ తీశారు. హార్దిక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో భాగంగా శుక్రవారం కోల్‌కతాతో హైదరాబాద్‌ తలపడనుంది.