Virat Kohli Hugs Lady Fan (Photo-X/Video Grab)

ఫిబ్రవరి 12, బుధవారం అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డేకు ముందు ఇతర ఆటగాళ్లతో కలిసి అహ్మదాబాద్‌కు బయలుదేరడానికి భువనేశ్వర్ విమానాశ్రయంలోకి ప్రవేశించిన వెంటనే టీం ఇండియా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ఒక లేడి అభిమానిని (Virat Kohli Hugs Lady Fan) కౌగిలించుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, మహిళా అభిమానిని కౌగిలించుకున్న తర్వాత కోహ్లీని పోలీసులు భద్రతా నడుమ మధ్య అక్కడి నుంచి వెళ్లారు. ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మాజీ కెప్టెన్ ఒక్క అంకె స్కోరుకే పరిమితమయ్యాడు.

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ రిష‌భ్ పంత్ దాతృత్వం ..తన ఆదాయంలో 10 శాతం పేద‌ల‌కు ఇస్తానని వెల్లడి,నెటిజన్ల  ప్రశంసలు

క‌ట‌క్ లో రెండో వ‌న్డే ముగిసిన త‌ర్వాత మూడో మ్యాచ్ కోసం జ‌ట్టు అహ్మ‌దాబాద్ వెళ్లేందుకు భువ‌నేశ్వ‌ర్ విమానాశ్ర‌యానికి చేరుకుంది. ఇక ఎయిర్‌పోర్టులో చెకింగ్ ఏరియాకు ముందు త‌మ అభిమాన ఆట‌గాళ్ల‌ను చూసేందుకు కొంత‌మంది ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఇంత‌లోనే అటువైపుగా వ‌చ్చిన కోహ్లీ.. ఆ గుంపులో నిల‌బ‌డ్డ ఓ మ‌హిళ‌ను చూసి న‌వ్వుతూ ఆమె వ‌ద్ద‌కు వెళ్లాడు. మ‌హిళ ద‌గ్గ‌రికి వెళ్లి హ‌గ్ (Virat Kohli Hugs Fan ) ఇచ్చి మాట్లాడాడు. దాంతో అక్క‌డే ఉన్న మిగిలిన అభిమానులు కోహ్లీకి షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో భ‌ద్ర‌తా సిబ్బంది క‌ల‌గ‌జేసుకుని విరాట్‌ను అక్క‌డి నుంచి పంపించారు.

Virat Kohli Hugs Lady Fan: 

భార‌త్‌, ఇంగ్లండ్ మూడు వ‌న్డేల సిరీస్ విష‌యానికి వ‌స్తే... ఇప్ప‌టికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ రెండింటీలోనూ ఆతిథ్య భార‌తే విజేత‌గా నిలిచింది. దీంతో టీమిండియా 2-0తో సిరీస్‌ను కూడా కైవ‌సం చేసుకుంది. దాంతో రేపు (బుధ‌వారం) అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగే మూడో వ‌న్డే నామమాత్రంగా మారింది.