Coronavirus Outbreak (Photo Credits: IANS)

Amaravati, June 17: ఏపీలో గడిచిన 24 గంటల్లో 15,188 శాంపిల్స్ పరీక్షించగా 275 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,555కు చేరినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. కరోనా మహమ్మారి‌ కారణంగా గడిచిన 24 గంటల్లో రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో(Andhra Pradesh) 90 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకొని 2,906 మంది డిశ్చార్జ్‌ కాగా.. ప్రస్తుతం 2,559 యాక్టివ్‌ కేసులున్నాయి. కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, తొమ్మిది మంది మృతి. 24 మందికి తీవ్రగాయాలు, మృతుల్లో ఇద్దరు చిన్నారులు

శ్రీకాకుళం జిల్లాలో తొలి కరోనా మరణం న‌మోదైంది. మంద‌స మండ‌ల కేంద్రంలో క‌రోనాతో బాధ‌ప‌డుతున్న 37 ఏళ్ల యువ‌కుడు బుధ‌వారం మృతి చెందాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన‌ అధికారులు మంద‌స ప‌ట్ట‌ణాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. క‌రోనా మ‌ర‌ణం నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌‌ర్ జె.నివాస్ మంద‌స మండ‌ల కేంద్రానికి వెళ్లనున్నారు. కాగా మ‌ర‌ణించిన వ్య‌క్తికి ఎలాంటి ట్రావెల్ హిస్ట‌రీ లేదు. కేవలం సంక్ర‌మ‌ణ ద్వారానే అత‌డికి క‌రోనా వ్యాపించిందని అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో 400 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 271 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో కేసుల దృష్ట్యా ఒక్క శ్రీకాకుళం ప‌ట్ట‌ణంలోనే 10 కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.

ప్రకాశం జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకపోతుండటంతో రోజు, రోజుకూ కోవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్క రోజే 18 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 207కు చేరుకుంది.

అసెంబ్లీ సమావేశాలు నేపధ్యంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కి సోమవారం రాత్రి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈపరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాసల్‌ స్వాబ్‌ పరీక్ష ద్వారా వైద్యులు వెల్లడించినట్లు మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయం అధికారులు తెలిపారు.