Coronavirus

Vijayawada, DEC 22: కొవిడ్‌ (Covid)కొత్త వేరియంట్‌ కేసులు చాపకింద నీరులా ప్రవహిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో నలుగురికి కరోనా పాజిటివ్‌ (Positive)కేసులు నమోదు కావడం కలవరానికి గురిచేస్తుంది. వైజాగ్‌లో ముగ్గురికి, ఏలూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌ను అధికారులు గుర్తించారు. వీరిని ముందు జాగ్రర్త గా ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. కొత్త వేరియంట్‌ పట్ల ఏపీ సీఎం జగన్‌ శుక్రవారమే అధికారులతో సమీక్ష నిర్వహించిన రోజే ఈ కేసులు బయట పడ్డాయి. ఏపీలో ముందస్తు చర్యలో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను(Oxgen Infra), పీఎస్‌ఏ ప్లాంట్లను, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, డి టైప్‌ సిలిండర్లను అధికారులు సిద్ధం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 56, 741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉంచారు.

Coronavirus in Telangana: నిలోఫర్ ఆస్పత్రిలో 14 నెలల చిన్నారికి కరోనా, తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు నమోదు, 16 కేసులు హైదరాబాద్‌లోనే.. 

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు.. ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని తేల్చిన అధికారులు.. అయితే జేఎన్‌–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Andhra Pradesh: నారా లోకేశ్‌పై సీఐడీ మరో పిటిషన్, స్కిల్‌ స్కాం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఏసీబీ కోర్టుకు తెలిపిన సీఐడీ 

‘‘పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నాం. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ పెడుతున్నాం. అలాగే ఆస్పత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్ధంచేస్తున్నాం. పీఎస్‌ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అలాగే ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు, డి–టైప్‌ సిలిండర్లు కూడా సిద్ధంచేశాం. 56,741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి’’ అని అధికారులు వెల్లడించారు.