Amaravati, Sep 14: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో ఎంపీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలకు కరోనా పాజిటివ్ గా ( 3 lok sabha mps tested positive for coronavirus) నిర్థారణ అయింది. చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డప్ప (Chittoor MP Reddappa), కాకినాడ ఎంపీ వంగా గీత ( Kakinada MP Vanga Geetha), అరకు ఎంపీ గొడ్డేటి మాధవిలకు (Araku MP Goddeti Madhavi) కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన వీరందరికీ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా ( lok sabha mps tested positive) తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.
అరకు ఎంపీ మాధవికి కూడా కరోనా సోకింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంపీ.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రెండు వారాల పాటు ఢిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు. కాకినాడ ఎంపీ వంగ గీతా సైతం ఇదివరకే వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా దేశంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగానే ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటవ్‌గా తేలిందని వార్తలు వస్తున్నాయి. ఇక స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్ ఇదివరకే ప్రకటించారు.
ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, నేటి నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలు
సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం 12.30 గంటలకి వారితో వర్చువల్ మీటింగ్‌లో (CM YS Jagan VC With MPs) పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని సూచించనున్నారు.
అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా ఎంపీలకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు . రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా నేటి సమావేశం జరగనుంది. ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఏపీకి సంబంధించిన కరోనా నియంత్రణ చర్యలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని వైఎస్సార్ సీపీ లోక్ సభాపక్ష నేత మిథున్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు.