AP COVID-19 Report: ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మందికి కరోనా, రాష్ట్రంలో తాజాగా 657 కరోనా కేసులు నమోదు, 15,252కి చేరిన మొత్తం కేసుల సంఖ్య, ఇప్పటివరకు 193 మరణాలు
Coronavirus in India (Photo Credits: IANS)

Amaravati, July 1: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 657 కరోనా పాజిటివ్‌లుగా (AP COVID-19 Report) నమోదవగా, ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,252కి చేరగా, ఇప్పటివరకు 193 మంది (coronavirus deaths) మరణించారు. రాష్ట్రంలోని మొత్తం కరోనా బాధితుల్లో 6988 మంది కోలుకోగా, 8071 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో 39 మంది ఇతర రాష్ర్టాలకు చెందినవారు కాగా, ఏడుగురు ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది, నేడు ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయం, 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

రాష్ట్రంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు 28,239 మందికి టెస్టులు చేయగా, మొత్తం 9,18,429 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు అత్యధికంగా కర్నూలులో 2045 కేసులు నమోదవగా, అనంతపురంలో 1689, కృష్ణాలో 1519, గుంటూరులో 1426, పశ్చిమగోదావరిలో 1209, చిత్తూరులో 1089 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Here's AP Corona Report

ఏపీలో కరోనా పరీక్షలు 9 లక్షలకు చేరువయ్యాయి. మంగళవారం నాటికి 8.90 లక్షల పరీక్షలు పూర్తవ్వగా.. ఈ సంఖ్య బుధవారం నాటికి 9 లక్షలు దాటింది. వైయస్ జగన్ మరో ముందడుగు, అత్యవసర సేవలు అందించే 108, 104 సర్వీసులను లాంచ్ చేసిన ఏపీ సీఎం, నేరుగా జిల్లాలకు వెళ్లనున్న వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో (AP High Court) పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ప్రకటించారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అయితే అత్యవసర పిటిషన్‌లను ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.