AP CM YS Jagan Mohan Reddy government offers zero interest loans (photo-Twitter)

Amaravati,July 1: జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఒకేసారి 1,008 సంఖ్యలో అధునాతన 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్టర్‌ వేదికగా ఆయన జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు ( #DoctorsDay) తెలియజేశారు. వైయస్ జగన్ మరో ముందడుగు, అత్యవసర సేవలు అందించే 108, 104 సర్వీసులను లాంచ్ చేసిన ఏపీ సీఎం, నేరుగా జిల్లాలకు వెళ్లనున్న వాహనాలు

ఏపీ (Andhra Pradesh) చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది. ఒకేసారి 1088 అధునాతన 104, 108 సర్వీసు వాహనాలను, గుంటూరు జీజీహెచ్ లో క్యాన్సర్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం గొప్ప ఆనందాన్నిస్తోంది. ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మనదని మొత్తం దేశం చూసేలా చాటిచెప్పాం’ అని ఏపీ సీఎం జగన్‌ ట్వీట్‌ (AP CM Doctor's Day Wishes) చేశారు.

Here's AP CM Tweet

ఈ రోజు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1,088 అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. దీంతో పాటు 108 సిబ్బంది జీతాలను కూడా భారీగా పెంచారు. మా ప్రాణాల కోసం మీ ప్రాణాలు పణంగా..,కరోనాతో విపత్తులో ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు, ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన ప్రధాని మోదీ

ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం వస్తుండగా, ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి 20వేల రూపాయల వరకు అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. అలాగే ఎమెర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల జీతాలను కూడా పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్‌ టెక్నీయన్‌ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు అందుతుందని సీఎం జగన్‌ చెప్పారు.