Volunteer Murder Case: మహిళా వాలంటీర్‌ను చంపేశాడు, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు, మలుపులు తిరుగుతున్న వాలంటీర్ శారద హత్య కేసు
Representational Image (Photo Credits: File Image)

Bapatla, May 19: ఏపీలో బాపట్ల జిల్లా చావలి గ్రామానికి చెందిన వాలంటీర్ శారద హత్య కేసులో (Volunteer Murder Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెను హత్య చేసిన పద్మారావు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు సమీపంలోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో పద్మారావు (Accused Padmarao commits suicide) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరుపతి నుంచి వైజాగ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు కింద పడి అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జేబులో ఉన్న ఐడీ కార్డుల ఆధారంగా మృతుడిని గుర్తించిన పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు సైతం చనిపోయింది పద్మారావేనని నిర్ధారించారు.వాలంటీర్ హత్యకు (Chavali Volunteer Sharada murder case ) సంబంధించి మనస్థాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

చావలి గ్రామ వాలంటీర్‌గా పని చేస్తోన్న శారదకు 2008లో అదే ఊరికి చెందిన వ్యక్తితో పెళ్లయ్యింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుండగా.. నాలుగేళ్ల క్రితం పద్మారావుతో శారదకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో.. పద్మారావును శారద దూరం పెట్టింది. ఆరు నెలల క్రితం పద్మారావు గ్రామ సచివాలయం వద్ద శారదపై చేయి చేసుకోగా.. వ్యవహారం వేమూరు పోలీసు స్టేషన్‌కు చేరింది. పోలీసులు అతణ్ని మందలించి వదిలిపెట్టారు. అప్పటి నుంచి శారదపై ఆగ్రహంతో ఉన్న పద్మారావు.. గత ఆదివారం సాయంత్రం ఆమె ఇంటి ముందు చీపురుతో ఊడుస్తోన్న సమయంలో కత్తితో దాడి చేశాడు.

గుంటూరు జిల్లాలో దారుణం, ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తప్పించుకొని పారిపోతున్న ఆమెను వెంబడించి మళ్లీ దాడి చేసి పరారయ్యాడు. దీంతో శారద అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న పద్మారావు.. గురువారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడ్డాడు. శారద హత్య కేసులో పోలీసులు తన కోసం వెతుకుతుండటంతోనే.. అతడు సూసైడ్ చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు