
Amaravati,Sep 23: ఏపీలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 72,838 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,228 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavrius Report) అయినట్టు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో ఏపీలో 6,46,530కి కరోనా కేసులు ( cumulative caseload to 6,46,530) చేరాయి. ప్రస్తుతం ఏపీలో 70,357 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటివరకు కరోనా నుంచి 5,70,667 మంది కోలుకున్నారని అధికారులు పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 50.02 లక్షల కరోనా టెస్టులు చేశారు. కరోనాతో గడిచిన 24 గంటల్లో 45 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 5,506కు (Coronavirus Deaths) చేరుకుంది.
తాజాగా చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా 5, తూర్పుగోదావరి, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందారు. బుధవారం కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1112, పశ్చిమగోదావరి జిల్లాలో 962, గుంటూరు జిల్లాలో 648 కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.
Here's AP Covid Report
#COVIDUpdates: #COVID19 cases in the last 24 hours as on 23/09/2020 till 10 AM #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/l78bAAyL7z
— ArogyaAndhra (@ArogyaAndhra) September 23, 2020
దేశంలో గత 24 గంటల్లో 83,347 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 56,46,011కు చేరింది. ఇందులో 45,87,614 మంది బాధితులు కోలుకోగా, 9,68,377 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 1085 మంది బాధితులు కరోనాతో మరణించడంతో మొత్తం మృతులు 90,020కి (COVID-19 Deaths) చేరారు. దేశంలో నిన్న 9,53,683 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 22 వరకు మొత్తం 6,62,79,462 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.