Amaravati, June 8: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 (జూన్ 16) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టిన వైఎస్సార్ సీపీ సర్కార్.. ఈ అసెంబ్లీ సమావేశాలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను (AP Assembly Budget Session 2020) ప్రవేశపెట్టనుంది. జూన్ 16న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. వైసీపీలోకి 10 నుంచి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుతో ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం
మార్చిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టినందున ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. ఈ నెల 11న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 18న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారని వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశం కనిపిస్తోంది.
సాధ్యమైనన్ని తక్కువ రోజుల్లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ నెల 31తో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ముగియనున్నది. ఇక అలాగే ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ బిల్లుతో పాటు, మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఏపీలో అన్నీ ఓపెన్, తాజాగా 125 కోవిడ్ 19 కేసులు, జ్వరం,దగ్గు లక్షణాలుంటే వెంటనే 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పలు రంగాలలో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చట్ట, శాసనసభ పనులకు సైతం లాక్‌డౌన్ (LockDown 5.0) నిబంధనలతో కాలాయాపన జరుగుతుంది. మరోవైపు లాక్‌డౌన్ 5.0తో మరిన్నింటికి కేంద్ర ప్రభుత్వం సడలింపులు ప్రకటించింది. ఆలయాలు, మత సంబంధమైన స్థలాలకు జూన్ 8 నుంచి అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session 2020) నిర్వహించేందుకు సిద్ధమైంది.