Amaravati. July 8: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి దినోత్సవం (YSR jayanthi 2020) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని (YSR Rythu Dinotsavam) నిర్వహిస్తోంది. ఈసందర్భంగా రైతు భరోసా కేంద్రాలకు డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెడుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులతో ముఖాముఖి, వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది. తెలుగు నేలపై చెరగని సంతకం, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు, ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, వైఎస్సార్ గురించి ఎవరేమన్నారంటే..
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని ఏపీ ప్రభుత్వం (AP Govt) ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఆయన తీసుకున్న చర్యలు విప్లవాత్మకమైనవని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ దివంగత నేత స్మారకంగా ప్రతి ఏడాది జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా జరుపుతామని ప్రకటించింది.
Here's AP Governor Tweet
Hon'ble Governor Sri Biswa Bhusan Harichandan paid tributes to former Chief Minister Dr #YSRajasekharaReddy on #YSRJayanthi. Governor said he loved farmers & spent his life dedicated to their welfare. AP Govt declared his birthday as AP #FarmersDay #YSRRythuDinotsavam#YSRForever pic.twitter.com/krcefNSNLM
— Governor of Andhra Pradesh (@governorap) July 8, 2020
Here's YSR Congress Party Tweet
Commemorating Mahaneta Dr. YS. Rajasekhara Reddy's birth anniversary today, the Government of Andhra Pradesh pays rich homage to the great soul by observing it as 'YSR Rythu Dinotsavam' #FarmersDay #YSRForever pic.twitter.com/QCcD8gX7Ar
— YSR Congress Party (@YSRCParty) July 8, 2020
దివంగత మహానేత వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు 32 లక్షల ఎకరాలు పంచారు. ఆరోగ్యశ్రీతో పేదలను ఆదుకున్నారు. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా గుండె ఆపరేషన్లు’’ చేయించారని అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాకపోవడం గమనించాలన్నారు. చెట్టు పేరు చెప్పుకుంటు కాయలు అమ్ముకునే వాళ్ళను పార్టీ సహించదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.