Polavaram Project(Photo-wikimedia commons)

Amaravati, July 19: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌డానికి నిర్దేశించిన గ‌డువును కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోమారు పొడిగించింది. 2024 జులై నాటికి (Centre extends the deadline to 2024) ఈ ప్రాజెక్టు పూర్తి చేయ‌డానికి సాధ్య‌ప‌డుతుందని కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంగ‌ళవారం పార్ల‌మెంటులో ఓ ప్ర‌క‌ట‌న చేసింది. పోల‌వ‌రం ప్రాజెక్టును ఎప్ప‌టిలోగా పూర్తి చేస్తార‌ని టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ సంధించిన ప్ర‌శ్న‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో రాత‌పూర్వ‌క స‌మాదానం చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోల‌వ‌రం ప్రాజెక్టు (completion of Polavaram Project) పూర్తి కావాల్సి ఉంద‌ని ఆ ప్ర‌కట‌న‌లో కేంద్రం వెల్ల‌డించింది.

ఈ సంద‌ర్భంగా ఏపీ ప్రభుత్వంపై కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డింది. రాష్ట్ర ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంటోంద‌ని ఆరోపించింది. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వ‌హ‌ణ‌లోనూ రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రి లోప‌భూయిష్టంగా ఉంద‌ని విమ‌ర్శించింది. కరోనా కూడా ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణంగా నిలిచిందని కేంద్రం తెలిపింది. ఈ నేప‌థ్యంలోనే పోల‌వరం ప్రాజెక్టు గ‌డువును మ‌రోమారు పొడిగించ‌క త‌ప్ప‌డం లేద‌ని కేంద్రం వెల్ల‌డించింది.

ఏపీ ఆదాయం తగ్గింది..ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా? తెలంగాణ మంత్రి పువ్వాడ పోలవ‌రం ప్రాజెక్టు వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ఏపీ మంత్రి బొత్స

ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం మళ్లీ పాత పాటే అందుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదని తెలిపారు. పన్నుల్లో వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినట్లు మంత్రి గుర్తు చేశారు.

పోలవరంతో భద్రాచ‌లానికి పెను ముప్పు, సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఏపీలో విలీనం అయిన 7 మండ‌లాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాలని డిమాండ్

15వ ఆర్థిక సంఘం కూడా అదే తరహాలో సిఫార్సులు చేసిందన్నారు. ఆ తర్వాత 41 శాతానికి సర్దుబాటు చేసిందని వెల్లడించారు. పన్నుల్లో వాటా, లోటు నిధుల సర్ధుబాటు ద్వారా రెవెన్యూ లోటును సర్ధుబాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు, విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశామని తెలిపారు. సంస్థల ఏర్పాటు అనేది సుదీర్ఘమైన ప్రక్రియ అని విభజన చట్టం అమలుపై ఇప్పటికే 28 సార్లు సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు.