CM YS Jagan (Photo-AP CMO Twitter)

Vjy, Sep 12: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జగన్‌ దిశానిర్దేశం చేస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్‌పై హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్‌, రేపు విచారణ చేపడతామని తెలిపిన ధర్మాసనం, నేడు కీలక తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు

చంద్రబాబును అరెస్టు చేసే క్రమంలో జరిగిన ప్రతి అంశాన్ని జగన్‌ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈ సమావేశంలో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.