Amaravati, April 24: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రబీలో ఇ– క్రాప్ బుకింగ్‌పై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు.48.02 లక్షల ఎకరాల్లో ఇ–క్రాప్ బుకింగ్ పూర్తయిందని వెల్లడించారు. 97.5 శాతం ఇ – క్రాపింగ్ పూర్తి చేశామన్నారు.ఇ– క్రాపింగ్ చేసుకున్న రైతులందరికీ కూడా డిజిటల్ రశీదులు, భౌతికంగా రశీదులు ఇచ్చామని తెలిపారు.
ఈ డేటాను సివిల్ సఫ్లైస్ డిపార్ట్‌మెంటుకు, మార్కెటింగ్ డిపార్ట్‌మెంటుకు పంపించామని అధికారులు పేర్కొన్నారు. 3953 ఆర్బీకే స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ)లకూ, 194 క్లస్టర్ స్ధాయి సీహెచ్‌సీలకూ మే 20లోగా వైఎస్సార్ యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.ఇప్పటికే గతంలో సుమారు 6,500 ఆర్బీకేల పరిధిలోని సీహెచ్‌సీలకు వ్యవసాయ ఉపకరణాలను అందించామని, ఆర్బీకే స్ధాయి సీహెచ్‌సీలకు రూ.8.2 లక్షలు, క్లస్టర్ స్ధాయి సీహెచ్‌సీలకు రూ. 25 లక్షల విలువైన యంత్రాలు ఉంచుతున్నట్టు వెల్లడించారు.
సమీక్ష హైలెట్స్ ఇవే..
వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద కిసాన్ డ్రోన్లు
►జులై నాటికి 500 డ్రోన్లు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ.
►డిసెంబర్ నాటికి 1500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయశాఖ చర్యలు.
►ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు.
►తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు వర్శిటీ చర్యలు.
►గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాలమేరకు ఉత్తరాంధ్రలోని విజయనగరంలో శిక్షణకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారుల వెల్లడి.
►ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలలో రైతు భరోసా ఇన్‌స్టాల్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని అధికారులకు సీఎం ఆదేశం.
►వైఎస్సార్ రైతుభరోసా కింద రైతులకు డబ్బు జమచేసేందుకు సిద్ధం కావాలని ఆదేశం.
►అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలి..
►మే 10 కల్లా అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపిన అధికారులు.
►సీఎం ఆదేశాల మేరకు ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన అధికారులు.
►467 వీఏఏ, 1644 వీహెచ్‌ఏ, 23 వీఎస్‌ఏ, 64 వీఎఫ్‌ఏ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి.
►4656 ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకీ చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
►ఖరీఫ్ సీజనల్లో రైతుల దగ్గరనుంచి సేకరించిన ధాన్యానికి దాదాపుగా చెల్లింపులు పూర్తి.
►రూ.7233 కోట్లకు గానూ రూ.7200 కోట్లు చెల్లించిన అధికారులు.
►ఖాతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు కారణంగా రూ.33 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్న అధికారులు.
►ఈ డబ్బునుకూడా వెంటనే చెల్లించాలన్న సీఎం.
►అలాగే తొలిసారిగా రైతులకు ఇస్తున్న గన్నీ బ్యాగులు, రవాణా ఖర్చుల పేమెంట్లు కూడా దాదాపుగా పూర్తిచేశామన్న అధికారులు.
►రబీ ప్రొక్యూర్‌మెంట్‌కు అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామని తెలిపిన అధికారులు.
►ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలి.
►ఆ రశీదు వెనుక రైతులనుద్దేశించి సూచనలు తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్ వెల్లడి.
►నాణ్యతా ప్రమాణాలను కూడా అందులో పేర్కొనాలని సీఎం సూచన.
►రైతులనుంచి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే, లేదా ధాన్యం కొనుగోలుకు అక్కడకు ఇక్కడకు వెళ్లమని ఎవరైనా చెప్తే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబరు 1967 కూడా తప్పనిసరిగా పొందుపరచాలని సీఎం ఆదేశం.
►ధాన్యానికి మరింత ధర వచ్చేలా రైతులకు తగిన అవకాశాలు కల్పించాలి.
►విదేశాల్లో డిమాండ్‌ఉన్న వంగడాలను సాగు చేయడంపై రైతుల్లో అవగాహన కల్పించాలి.
►దీనివల్ల ఎగుమతులు పెరిగి వారికి మంచి ధర వస్తుంది.
►రైతులకు అవసరమైన వంగడాలు, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచాలి.
►ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక గోడౌన్ ఉండాలన్న కార్యాచరణ దిశగా ముందుకు సాగాలి.
►దీన్ని పరిగణలోకి తీసుకునే మ్యాపింగ్ చేశామన్న అధికారులు.
► దీంట్లో భాగంగా 1005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టామని, 206కుపైగా పూర్తయ్యాయని, మరో 93 గోడౌన్లు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయని మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
►జులై కల్లా వీటిని పూర్తి చేసి.. సీఎం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతామని వెల్లడి.
►నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందిస్తున్న ప్రక్రియ మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని వైఎస్ జగన్ ఆదేశం
►ప్రతిఏటా ఈ పంపిణీ మొత్తం పెరగాలని సూచన.
►గత ఏడాది సుమారు 7 లక్షల టన్నులకు పైగా ఎరువులు అందించామని, ఈ ఏడాది మరింతగా పెంచుతామన్న అధికారులు.
►పంటల ధరలపై సీఎం యాప్ ద్వారా వచ్చిన సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుంటున్నామని తెలిపిన అధికారులు.
►సీఎం యాప్ ద్వారా వివిధ ప్రాంతాలనుంచి, వివిధ పంటలకు వస్తున్న ధరలు, వాటి పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.
►నిరంతరం మాక్ డ్రిల్ చేస్తూ... ఈ విధానం పనితీరును పర్యవేక్షించాలన్న సీఎం.
►ఎక్కడైనా లోపాలు ఉంటేం వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
►సీఎంయాప్ ఎలా పనిచేయాలన్నదానిపై నిర్దేశించుకున్న ఎస్‌ఓపీని నిరంతరం పర్యవేక్షించాలన్న సీఎం.
►ఎక్కడైనా రైతులకు కనీస మద్దతు ధర లభించలేని పక్షంలో వెంటనే జోక్యంచేసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం.