Cm Jagan (Photo-Video Grab)

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సీబీఐ కోర్టు మన్నించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బెయిల్ నిబంధనలు సడలించాలని కోర్టును కోరారు. అయితే, అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. జగన్ పిటిషన్ పై నేడు విచారణ కొనసాగించిన సీబీఐ కోర్టు... జగన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని జగన్‌ను ఆదేశించింది.  ఏపీలో ఇంకా క్లారిటీ రాని పూర్తి స్థాయి పోలింగ్ శాతం, గత ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదు, ఈ సారి దాన్ని క్రాస్ చేసిన ఓటింగ్ శాతం

ఏపీలో నమోదైన పోలింగ్‌, ఓటర్లను ఉద్ధేశిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. మండుటెండల్లోనూ తనకు ఓటువేసి ఆశీర్వదించేందుకు సునామీల తరలివచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన పాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.