Jagan Mohan Reddy Polavaram Visit (Photo-Video Grab)

Polavaram, June 6: పోలవరం నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. పునరావాసం కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. షెడ్యూల్‌ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలని పేర్కొన్నారు.12, 658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు తెలిపారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చి దిద్దాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. పోలవరం వద్ద బ్రిడ్జిని నిర్మించాలని పేర్కొన్నారు.

దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఇది పూర్తయితే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్‌ కల్లా డయాఫ్రం వాల్‌ పనుల పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.పోలవరం ప్రాజెక్టులో చిన్న సమస్యలను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారని.. వరద నీటి ప్రవాహం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు.

కొనసాగుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యటన, ప్రాజెక్ట్ పనులపై అధికారులతో సమీక్షా సమావేశం

ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయా ఫ్రం వాల్‌ దెబ్బతినడంతో ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఇది మాత్రం ఎల్లో మీడియాలో కనిపించలేదని ఎందుకంటే.. రామోజీ బంధువులకే నామినేషన్‌ పద్దతిలో పనులు అప్పగించారని సీఎం తెలిపారు. ప్రాజెక్ట్‌ స్ట్రక్చర్‌లో ఏమాత్రం సంబంధం లేని గైడ్‌వాల్‌.. ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయని.. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారని, ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారని, ఈ ఖాళీల గుండా వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.

మరో తుపాను దూసుకొస్తోంది, ఈ సారి ముంబైని వణికించనున్న సైక్లోన్ బైపార్జోయ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్‌ దారుణంగా దెబ్బతిందని.. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదని, ఎందుకంటే.. రామోజీరావు బంధువులకే నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించారని ప్రస్తావించారు. ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేని గైడ్‌వాల్‌ వంటి చిన్న సమస్యను పెద్ద విపత్తులాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయినా దీన్నికూడా పాజిటివ్‌గా తీసుకుని తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమగ్రంగా పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. గత సీజన్‌లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు పెంచిన ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు, ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న దిగువ కాఫర్‌ డ్యాం పనులను కూడా సీఎం దగ్గరుండి పరిశీలించారు.