 
                                                                 Amaravati, May 4: విద్యుత్ శాఖపై ముఖ‍్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి బుధవారం సమీక్ష (CM Jagan Review) నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యుత్ డిమాండ్-సప్లై, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం (CM Jagan Review Meeting On Power Sector) సమీక్షించారు. వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీగా విద్యుత్తును ( Power Sector ) కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు.
ఇక ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కీలక ప్రకటన చేశారు. ఇంధన శాఖపై బుధవారం జరిగిన సమీక్షలో భాగంగా మాట్లాడిన జగన్... ఉచిత విద్యుత్‌కు చెందిన డబ్బును నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ఆ తర్వాత విద్యుత్ బిల్లులను రైతులే చెల్లిస్తారని ఆయన అన్నారు. ఈ పద్దతి అమలైతే విద్యుత్ సేవలకు సంబంధించి రైతు ప్రశ్నించగలుగుతాడని ఆయన పేర్కొన్నారు.
మార్చిలో 1268.69 మిలియన్ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని, ఏప్రిల్‌లో 1047.78 మిలియన్ యూనిట్లు రూ.1022.42 కోట్లతో కొన్నామని అధికారులు పేర్కొన్నారు. డీబీటీద్వారా ఉచిత విద్యుత్తు డబ్బు రైతుల ఖాతాల్లో వేస్తామని, నేరుగా రైతులే చెల్లిస్తారని, దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతులు ప్రశ్నించగలుగుతారని సీఎం అన్నారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్‌ప్రాజెక్ట్ విజయవతం అయ్యిందని, 2020–21లో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 ఎం.యు. కరెంటు ఖర్చుకాగా, 2021– 2022లో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరినా 67.76 ఎం.యు. కరెంటు మాత్రమే వినియోగించారని అధికారులు తెలిపారు. 33.75 ఎం.యు. కరెంటు ఆదా అయ్యిందన్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
