Six students suspended from a school in Sri Satya Sai district (Photo-Video Grab)

Sri Satya Sai, May 4: ఏపీలో ఏప్రిల్‌ 30వ తేదీన పాఠశాలలోని తరగతి గదిలో కొందరు విద్యార్థులు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ధ్వంసం (nuisance) చేసిన వీడియో వైరల్ అయిన సంగతి విదితమే. ఈ ఘటనలో శ్రీసత్యసాయి జిల్లా (Sri Satya Sai district) నల్లమాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్‌ (Six students suspended) చేసినట్లు ఆ జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై మంగళవారం డీఈఓతో పాటు డిప్యూటీ డీఈఓ మీనాక్షి, ఏడీ రామకృష్ణ, ఎంఈఓ వేమనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ... ఘటనపై సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని, తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని తెలిపారు.

ఏప్రిల్‌ 30న ఎస్‌ఏ పరీక్షలు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు ఓ తరగతిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, డెస్క్, వైర్‌కుర్చీ(చైర్‌) ధ్వంసం చేశారు. ఆ రోజు విధుల్లో ఉన్న ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం శ్యాంప్రసాద్‌ ఫిర్యాదు మేరకు హెచ్‌ఎం రమణప్ప మరుసటి రోజు ఘటనకు బాధ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు.

సుఖం కోసం డబ్బులు చెల్లించి వ్యభిచార గృహానికి విటుడుగా వెళ్లాడు, అతనిపై కేసు ఎలా పెడతారంటూ ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తమ పిల్లలు చేసిన పనికి తాము క్షమాపణలు కోరుతున్నామని, మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చూసుకోవడంతో పాటు ధ్వంసమైన ఫర్నీచర్‌ మరమ్మతులకు అయ్చే ఖర్చు తామే భరిస్తామని చెప్పడంతో అప్పట్లో సమస్య సద్దుమణిగింది.

.