CM Jagan (Photo-Twitter/AP CMO)

Anantapur, April 26: అనంతపురం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం కింద బటన్‌ నొక్కి రూ.912.71 కోట్లు నిధులను విడుదల చేశారు సీఎం జగన్‌.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 9,55,662 మంది విద్యార్థుల తల్లుత ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నాం. ఆంధ్రప్రదేశ్ లో భావితరాలను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దే గొప్ప ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

జగనన్న వసతి దీవెన ద్వారా ఐటీఐ చదివే విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. చదువుకున్న శక్తి గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కులాల చరిత్రను, కుటుంబాల పరిస్థితిని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని అన్నారు.

బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, మోదీ విజన్ సూపర్ అంటూ ప్రశంసలు, రిపబ్లిక్ చర్చలో టీడీపీ అధినేత ఇంకా ఏమన్నారంటే..

పేదరికం సంకెళ్లను తెంచేసే అస్త్రం చదువొక్కటేనని ఆయన స్పష్టం చేశారు. చదువు విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ నాలుగేళ్లు రాష్ట్రంలో విద్యార్థులకు అండగా నిలబడుతూ వస్తున్నామని వివరించారు.చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు.. ఆ కుటుంబానికి చెందిన సామాజకి వర్గాన్నే మారుస్తుంది. ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని సీఎం తెలిపారు.

పిల్లల చదువుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా అప్పులపాలు కాకూడదనే సదుద్దేశంతో జగనన్న వసతి దీవెన పథకం తీసుకొచ్చామని జగన్ వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకూడదని అనేక పథకాలు అమలు చేస్తున్నామని, జగనన్న వసతి దీవెన కూడా అందులో ఒకటని తెలిపారు.

ఈ పథకం కింద ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా డబ్బు జమ చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఐటీఐ చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.20 వేలు జమ చేస్తున్నామని చెప్పారు.

77 మంది డీఎస్పీలను బదిలీ చేసిన జగన్ సర్కారు, ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లోని 9,55,662 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.912.71 కోట్లు ఈ రోజు (బుధవారం) జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత బటన్ నొక్కి నిధులను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు. ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వివరించారు.

గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించాలి. పేదలు కూలీలు, కార్మికులుగా మిగలాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. మన ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల డ్రాప్‌ అవుట్ల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ స్కూల్స్‌ ప్రైవేట్‌ స్కూళ్లతో పోటీ పడుతున్నాయి. గవర్నమెంట్‌ స్కూళ్లలో డిజిటల్‌ బోధన అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం. 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో​ ఉన్నత విద్య చదివేవారి సంఖ్య పెరిగింది. గవర్నమెంట్‌ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.

ఇది విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న వసతిదీవెన. ఫీజురియింబర్స్‌మెంట్‌ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు.. బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ప్రతి 3 నెలలకు తల్లుల ఖాత్లాలో డబ్బులు జమ చేస్తున్నాం. నా తమ్ముళ్లు, చెల్లెళ్లు సత్యా నాదెళ్లతో పోటీపడే పరిస్థితి రావాలి. యువతను ప్రపంచ స్థాయి లీడర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం. ఆత్మవిశ్వాసం, కామన్‌సెన్స్‌తో పాటు డిగ్రీ ఉంటే మీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. నాలెడ్జ్‌ ఈజ్‌ పవర్‌.. ఎడ్యూకేషన్‌ ఈజ్‌ పవర్‌.

చంద్రబాబుపై విమర్శలు..

వచ్చీరాని ఇంగ్లిష్ లో రిపబ్లిక్ టీవీకి ఓ ముసలాయన ఇంటర్వ్యూ ఇచ్చారని ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా చంద్రబాబును విమర్శించారు. ఆయన మాటలు వింటుంటే తనకు పంచతంత్రం కథ గుర్తుకొచ్చిందని చెప్పారు. నరమాంసం రుచి మరిగిన పులి వృద్ధాప్యంలో మాంసం తినడం మానేశానని అబద్ధాలు చెబుతూ మనుషులను నమ్మించాలని ప్రయత్నిస్తోందని చెప్పారు. నాలుగు నక్కలను వెంటేసుకుని, నలభై ఏళ్ల ఇండస్ట్రీ (అనుభవం) ఉందంటూ అడవిలో బాటసారులను నమ్మించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

అబద్ధాలు చెప్పే వారిని, మారిపోయామని చెప్పే మోసగాళ్లను, వెన్నుపోటు పొడిచే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని పంచతంత్రం కథలోని నీతిని గుర్తించాలని జగన్ వివరించారు. ఈ కథ వింటే నారా చంద్రబాబే గుర్తుకొస్తాడని జగన్ తెలిపారు. ఇటీవల ఓ సభలో చంద్రబాబు మరోమారు ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అని చెప్పాడు. ఆయన మాటలు వింటుంటే.. ఈయనకు ఈ జన్మలో బుద్ధి రాదని తనకు అనిపించిందని జగన్ చెప్పారు.

రోజూ రాజకీయాల మధ్య మనం బతుకుతున్నాం. నేను సీనియర్‌ను ఇప్పుడు మంచోడిని అయ్యాను అని నమ్మించే ప్రయత్నం చేశారు. బంగారు కడియం ఆశచూపి మనుషులను మింగేసే పులి బాపతు వెన్నుపోటు బాబు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిఏ ఘటికుడు చంద్రబాబు. మాయమాటలు చెప్పే బాబు లాంటి వారిని నమ్మకూడదు. రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశాడు. బాబు వచ్చాడు.. రైతులను నట్టేట ముంచాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయి. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. మొండిచేయి చూపాడు.

దోచుకో, పంచుకో, తినుకో ఇదే చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వీరికి తోడుగా దత్తపుత్రుడు. ఇది గజదొంగల ముఠా. బాబు అబద్దాలను, మోసాలను నమ్మకండి. జగనన్న వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో ఆలోచించండి. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను. నా నమ్మకం, నా ఆత్మవిశ్వాసం ప్రజలే. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి.