CM Jagan on PRC: ఉద్యోగులకు శుభవార్త, ఫిట్‌మెంట్‌ని 23శాతంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం
AP Chief Minister YS Jagan | File Photo

Amaravati, Jan 7: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీపై నిర్ణయం తీసుకుంది.  ఫిట్‌మెంట్‌ని 23. 29 శాతంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ అమలు జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్‌ అమలు ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్‌ 30లోగా నిర్ణయం తీసుకోనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది.పెంచిన డీఎలు జనవరి నుంచి చెల్లించనున్నారు.

రాష్ట్రంలో పరిస్థితులను బట్టి పొత్తులు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, అవసరమైనప్పుడే ఆయన లవ్ చేస్తారని సోము వీర్రాజు చురక

11వ వేతర సవరణ సంఘం నివేదిక అమలు, ఇతర డిమాండ్ల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. నిన్నటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నుంచి సీఎం అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్ సీ సమావేశం నిర్వహించారు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపిన సీఎం అనుకున్న విధంగానే పీఆర్సీ పై ప్రకటన విడుదల చేశారు.