AP Chief Minister YS Jagan Mohan Reddy starts YSR Vahana Mitra (Photo-Twitter)

ఏపీ ప్రభుత్వం మరో పథకానికి సంబంధించి నిధుల్ని విడుదల చేసింది. సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు వైఎస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra) పథకం నిధులను నేడు సీఎం జగన్ విడుదల చేశారు. ఇవాళ విజయవాడలోని విద్యాధరపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం నిధుల్ని బటన్ నొక్కి లబ్దిదారుల అకౌంట్‌లోకి జమ చేశారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది.

2023–24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేసింది. దీంతో కలిపి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించారు.

నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు, విచారణకు సహకరించాలని ఆదేశాలు, నోటీసులు అందజేయాలని సీఐడీకి సూచన

ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునేవారికి సొంతంగా ఆటో రిక్షా లేదా టాక్సీ లేదా టాక్సీ క్యాబ్ ఉండాలి. సరైన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి.. అలాగే బీపీఎల్, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తు దారుడికి డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్సీ కూడా అతడి పేరు మీద ఉండాలి. కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒకవేళ వేరే రాష్ట్రం లో వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్లు అడ్రస్‌ను ఆంధ్రప్రదేశ్‌కి మార్చుకుంటేనే అర్హులు. వాహనం యొక్క ఓనర్ షిప్, లైసెన్స్, రైస్ కార్డు లో ఉన్నటువంటి ఎవరి పేరు మీద అయినా ఉండవచ్చు. అంతేకాదు 18 ఏళ్లకు పైన వయసు వారే అర్హులు.

రహదారి భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం,రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు

మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.10వేలు, పట్టణ ప్రాంతంలో రూ.12 వేలు మించకూడదు. మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు. దరఖాస్తు చేసుకునేవారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారు ఉండకూడదు. కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగం సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి. పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు. కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయ పన్ను చెల్లించకూడదు.

వాహన మిత్ర పథకాన్ని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్‌ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా స్వీకరించిన అప్లికేషన్స్ ఆరు దశల్లో ధ్రువీకరణ తర్వాత అర్హుల జాబితాను ప్రదర్శిస్తారు. ఒకవేళ అర్హత ఉన్నా జాబితాలో పేరు లేకపోతే మరోసారి కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.