Nara Lokesh (Photo/TDP)

Vjy, Sep 29: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 41 సీఆర్‌పీసీ కింద ఈ కేసులో లోకేష్‌కి నోటీసులు అందజేయాలని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధనా విభాగాన్ని కోర్టు కోరింది. మరోవైపు విచారణకు సహకరించాల్సిందేనని నారా లోకేష్‌కు తేల్చి చెప్పింది.

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అగ్ర నేతలతో సహా 26 మందికి హైకోర్టు నోటీసులు, పిటిషన్‌పై విచారణ నాలుగు వారాలకు వాయిదా

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్‌ పేరు చేరుస్తూ ఈ మధ్యే విజయవాడ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసిన సంగతి విదితమే. దీంతో అరెస్ట్‌ భయంతో.. నారా లోకేష్‌ ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. లోకేష్‌ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. సీఐడీ తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్‌ నోటీసులు అందజేస్తామని కోర్టుకు తెలిపి నోటీసులు చూపించారు. కాగా,నారా లోకేష్ బాబుకు నోటీసులు అందించేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీలో ఉన్నట్లు తెలిసింది.

చంద్రబాబు అరెస్ట్, ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన జగన్ సర్కారు

ఈ క్రమంలోనే లోకేష్‌కు 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. మేము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నాం. దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని లోకేష్‌ను ఆదేశించిండి’’ అని ఏజీ శ్రీరామ్‌ చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని సూచించింది. మరికాసేపట్లో ఏపీ సీఐడీ అధికారులు లోకేష్‌ను కలిసి నోటీసులు అందించే అవకాశాలు ఉన్నాయి.