AP CM Jagan Writes to PM Modi: ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తోంది, వెంటనే ఆపండి, ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం వైయస్ జగన్, విద్యుత్‌ ఉత్పత్తిని వెంటనే ఆపించేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరిన ఏపీ ముఖ్యమంత్రి
Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, Julu 7: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ (AP CM Jagan Writes to PM Modi) రాశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై పీఎంకు మరోసారి ఫిర్యాదు చేశారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని ఈ లేఖలో కోరారు. పదే పదే జలశక్తి శాఖకు, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తోందని, తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని కోరారు.

లేఖలో.. ‘‘ తెలంగాణ ప్రభుత్వం (TS Govt) చట్టవిరుద్ధంగా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తోంది. కేఆర్‌ఎంబీ (KRMB) పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా... జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలి. శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. దీని వల్ల పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ (Telangana) అడ్డుకుంటోంది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీటిని వాడేయటం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ప్రాజెక్టుల్లో తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండటం వల్ల విలువైన నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తిందని లేఖలో 'సీఎం ( Andhra Pradesh CM YS Jagan Mohan Reddy ) తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు, వైఎస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్సార్‌ గ్రూపు, సీఎం జగన్‌ని కలిసిన ఎస్సార్‌ గ్రూప్‌ ప్రతినిధులు

ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపకాల విషయంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ లాంటి యంత్రాంగాలు ఉన్నప్పటికీ తెలంగాణ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తోంది. తక్షణం తెలంగాణ చేస్తున్న నీటి వినియోగాన్ని నిలువరించకపోతే ఏపీ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి. విభజన చట్టం ప్రకారం హక్కుగా ఏపీకి చెందాల్సిన నీటి వాటా విషయంలో నష్టపోవాల్సి వస్తుంది. సాగునీటికి సంబంధించిన అవసరాలు ఉన్నప్పటికీ తెలంగాణ నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోంది.

తగ్గేదేలే.. కృష్ణా నీటి కోసం రాజీ లేని పోరుకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటన, అన్ని వేదికలపైనా, పార్లమెంటులోనూ ఏపీ తీరును ఎండగడతామని వెల్లడి

శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల దిగువన నీటిని ఏపీ వినియోగించుకోలేదని తెలిసే తెలంగాణ విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం దారుణం. జూన్‌ 1 నుంచి 26 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే అందులో 19 టీఎంసీల నీటిని విద్యుత్‌ ఉత్పత్తి కోసం వాడేశారు. ఉమ్మడి ప్రాజెక్టులపై కేఆర్‌ఎంబీతో పాటు సీఐఎస్‌ఎఫ్‌ రక్షణ కల్పించేలా ఆదేశించాలి’’ అని ప్రధాని మోదీని లేఖలో కోరారు.

కేఆర్‌ఎంబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. దీంతో కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతానికి ఇబ్బంది కలుగుతుంది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేలా.. సీఐఎస్‌ఎఫ్‌ బలగాల పరిధిలోకి ప్రాజెక్ట్‌లను తేవాలి. తక్షణమే తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా... కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు. ఇరిగేషన్, విద్యుత్, తాగునీరు, ఉమ్మడి రిజర్వాయర్లకు చెందిన అధికారులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది, కేంద్ర మంత్రులకు లేఖల ద్వారా ఫిర్యాదు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ ప్రాజెక్టులు సందర్శించాకే ఏపీ ప్రాజెక్టులు సందర్శించాలని లేఖలో తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

మొత్తం 14 పేజీలతో కూడిన ఉత్తరాన్ని ప్రధానికి పంపించారు. గతంలో… తెలంగాణ చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని వెంటనే ఆపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావాత్‌కు, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు ఇదివరకే విడివిడిగా లేఖలు రాశారు. తెలంగాణలో ప్రాజెక్ట్‌లు, నీటి వాడకం, విద్యుత్ ఉత్పత్తిపై వీరిద్దరికీ 4 పేజీలతో లేఖ రాశారు. శ్రీశైలంలో 834 అడుగులకు కింద నీటి మట్టం ఉన్నా ఉత్పత్తి ఆపడం లేదని, కృష్ణా బోర్డు చెప్పినా వినడం లేదని తెలంగాణపై ఫిర్యాదు చేశారు.

విభజన చట్టాన్ని తెలంగాణ ఉల్లంఘిస్తోందని, ఆ రాష్ట్రంలో కడుతున్న ప్రాజెక్ట్‌లను, నీటి వాడకాలను పరిశీలించిన తర్వాతే రాయలసీమ లిఫ్ట్‌ను KRMB సందర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కోరారు సీఎం జగన్‌. ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ ప్రకాశ్‌ జవదేవకర్‌కు లేఖ రాశారు