Amaravati., Dec 28: ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఇరువురి మధ్య దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు. కాగా ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఢిల్లీకి వచ్చారు.
ఇప్పటికే ఏపీ సమస్యల పరిష్కారానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాధన్ నేతృత్వంలో ఇది వరకే ప్రధాని కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీతో ఏపీ ఉన్నతాధికారుల బృందం పలు సమావేశాలు నిర్వహించింది.
ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు బకాయిలు, తెలంగాణ నుంచి రావలసిన విద్యుత్ బకాయిలు, బీచ్ శాండ్ మైనింగ్, కడప స్టీల్ ప్లాంట్, తదితర అంశాలపై ప్రధానితో చర్చించారు.
Here's ANI Tweet
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy called on Prime Minister Narendra Modi in Delhi.
(Pic: PMO) pic.twitter.com/O9bwmfv9b0
— ANI (@ANI) December 28, 2022
ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపెంద్ర యాదవ్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అవుతారు.