YS Jagan Cabinet (Photo-Twitter)

Amaravati, May 10: ఏపీ మంత్రివర్గ విస్తరణ అనంతరం నూతన కేబినెట్‌ తొలిసారి మే 12న సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ (CM Jagan First Cabinet Meeting) నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక నేడు జలవనరుల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష చేపట్టారు. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy)తో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) మంగళవారం భేటీ అయ్యారు. మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్ట్, పదవ తరగతి ప్రశ్నాపత్నం లీక్‌పై ప్రధానంగా చర్చ జరుగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం టెన్త్‌ పేపర్ల మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో విచారణ జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేపర్‌ లీకేజీ కేసులో మొత్తం 60 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. అందులో భాగంగానే మాజీమంత్రి నారాయణను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఇతర కేసులపై తన దగ్గర సమాచారం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.