Andhra Pradesh CM YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati, Jan 12: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీఘ వేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఏపీ సీఎం అమ్మఒడి పథకం (Jagananna Amma Vodi) ద్వారా పేద పిల్లల చదువుకు అండగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థుల తల్లులు అమ్మఒడి నిధులు వద్దనుకుంటే ఆ డబ్బుకు బదులు వచ్చే ఏడాది నుంచి నుంచి ల్యాప్‌టాప్‌లు (laptops) ఇస్తామని తెలిపారు.

సోమవారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో అమ్మఒడి రెండో విడతను ప్రారంభించిన సంగతి విదితమే. ఈ విడతలో 44.48 లక్షల మంది తల్లులకు రూ.15వేలు చొప్పున 6773 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఇందులో వెయ్యి రూపాయలు పాఠశాల పారిశుధ్య నిధికి పోగా, మిగిలిన 14వేలు తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని ఈ సందర్భంగా సీఎం జగన్‌ (Andhra Pradesh CM YS Jagan) తెలిపారు.

కాగా పారిశుధ్య నిర్వహణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించడం పెద్దకష్టం కాదు. అయితే తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటేనే పాఠశాలల పారిశుధ్యం మెరుగ్గా ఉంటుందనేదే ప్రభుత్వ ఉద్దేశం. గత ఏడాదికన్నా ఈ ఏడాది 2 లక్షల మందికి అదనంగా ఈ పథకం కింద లబ్ధి చేకూరింది. అమ్మఒడి, నాడు-నేడు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు బోధన, విద్యాకానుక, జగనన్న గోరుముద్దు తదితర పథకాల కారణంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని సీఎం అన్నారు.

జగనన్న అమ్మ ఒడి డబ్బులు విడుదల, రెండో దఫా మొత్తం రూ.6,673 కోట్లను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొచ్చామని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి

ఒక్కరోజు పిల్లవాడు బడికి హా జరు కాకున్నా తల్లిదండ్రులకు ఫోన్‌ మెసేజ్‌ వెళుతుంది. వరుసగా రెండు రోజులు రాకుంటే నేరు గా వాలంటీరు వాళ్ల ఇంటికే వెళ్లి పిల్లల యోగక్షేమాలు తెలుసుకుంటారు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి పిల్లలను తిరిగి బడికి పంపే బాధ్యతను గ్రామ సచివాలయాల సిబ్బందికి, టీచర్ల మీద పెడుతున్నామని తెలిపారు. మూడేళ్లలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే ధ్యేయంగా పని చేస్తున్నామని సీఎం తెలిపారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డకు షాకిచ్చిన హైకోర్టు, ఎన్నికల షెడ్యూల్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీ హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ

అమ్మఒడిలో వచ్చే ఏడాది నుంచి ల్యాప్‌టాప్‌ ఆప్షన్‌ను ఇవ్వనున్నామన్నారు. ఓపెన్‌ మార్కెట్‌లో రూ.25-27వేల రూపాయల ఖరీదు చేసే ల్యాప్‌టాబ్‌లను రూ.18,500లకే ఇచ్చేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. 9 నుం చి 12వ తరగతి చదివే పిల్లల తల్లులకు, ‘వసతి దీవెన’ అందుకొంటున్న తల్లులకు కూడా వర్తిస్తుంది. 8వ తరగతి నుంచి కంప్యూటర్‌ అక్షరాస్యత ప్రవేశపెడుతున్నాం. రాబోయే తరాన్ని పోటీ ప్రపంచంలో నిలబెట్టే చర్యల్లో భాగంగా రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికీ అండర్‌ గ్రౌండ్‌ ఇంటర్నెట్‌ కేబుల్‌ ఏర్పాటు చేస్తాం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అంగన్‌వాడీ స్థానంలో వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ-1(పీపీ1), ప్రీ ప్రైమరీ-2(పీపీ-2), ప్రీ ఫస్ట్‌ క్లాస్‌లుగా పేర్లు మార్చుతామన్నారు.