Amma Vodi: జగనన్న అమ్మ ఒడి డబ్బులు విడుదల, రెండో దఫా మొత్తం రూ.6,673 కోట్లను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొచ్చామని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
AP CM YS Jagan Speech Highlights On BC Sankranthi Sabha At Vijayawada(Photo-Twitter)

Nellore, Jan 11: నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ (JAGANANNA AMMAVODI) రెండో ఏడాది చెల్లింపులను నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున రూ.6,673 కోట్లు జమ చేస్తున్నారు. నెల్లూరులో జరుగుతోన్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) కంఫ్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదవాలన్నదే లక్ష్యమని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా 45 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష అని, 19 నెలల పాలనలో చదువుల విప్లవం తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను ఒక క్రమ పద్దతి ప్రకారం నిర్వీర్యం చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో దోపిడీ జరిగేదన్నారు. పరిస్థితులను మార్చేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.

Here's AP CM Speech

పాఠశాలకు విద్యార్ధి రాకపోతే మొదటి రోజు ఫోన్‌లో మెసేజ్‌.. వరుసగా రెండు రోజులు రాకుంటే వాలంటీర్‌ నేరుగా ఇంటికొచ్చి విద్యార్ధి యోగక్షేమాలు తెలుసుకుంటారని వెల్లడించారు. పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రుల కమిటీలతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు, వాలంటీర్లపై ఉందన్నారు. రాబోయే మూడేళ్లలో వంద శాతం పిల్లలు బడిబాట పట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు.

అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపిస్తే రూ.15వేలు సాయం అందించామని, వరుసగా రెండో ఏడాది కూడా (Amma Vodi Scheme 2nd Phase Payment) అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అందజేస్తున్నామని, గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు.

ఇండియాలో 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్, నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌, ఈనెల 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభం

చదువుల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం (AP Govt) అడుగులు వేస్తోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్కూలు ఫీజులు కట్టలేక చిన్నారుల్ని కూలిపనులకు పంపుతున్న సందర్భాల్ని చూశానని జగన్ అన్నారు. ఆ పరిస్థితుల్ని మార్చడానికే జగనన్న అమ్మఒడి (AP Amma Vodi Scheme) కార్యక్రమాన్ని తీసుకొచ్చామని జగన్ అన్నారు. ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష అని, 19 నెలల పాలనలో చదువుల విప్లవం తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు.

జగన్ మామ ఉన్నాడన్న ఆనందంలో చిన్నారులున్నారు: మంత్రి ఆదిమూలపు

విద్యాశాఖకు మంత్రిగా దళితుడైన తనను చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో చిన్నారులంతా తమకు జగన్ మామ ఉన్నాడన్న సంతోషంలో ఉన్నారని ఆదిమూలపు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దార్శనికుడు, సంఘ సంస్కర్త అని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో మంత్రి మాట్లాడారు. ఈ రోజు చారిత్రాత్మక దినం. ఎన్నో అరిష్టాలు, అడ్డంకులు, కుయుక్తులు, కుట్రలు చేధించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్న శుభ దినం అని మంత్రి చెప్పారు.

Here's Minister adimulapu Suresh Speech

నా అంత్యక్రియలకు వైఎస్ జగన్ సీఎంగా హాజరు కావాలి’ : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

తన అంత్యక్రియలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా హాజరు కావాలని కోరుకుంటున్నానని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన జీవితకాలంమంతా జగన్ సీఎం గానే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దేశానికే ఆదర్శమైన పాలన అందిస్తూ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారని శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆనాడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమానికి పది అడుగులు ముందుకేస్తే.. ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ వంద అడుగులు ముందుకేస్తున్నారు.

MLA Kotamreddy Sridhar reddy Speech

నువ్వా… మాట్లాడేది.! మా ముఖ్యమంత్రి గురించి.? : మంత్రి అనిల్

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు అమ్మఒడి సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నువ్వా… మాట్లాడేది మా ముఖ్యమంత్రి గురించి.? అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని విమర్శించారు. మళ్లీ జన్మంటూ ఉంటే జగన్ సైనికుడిగానే ఉంటానని అనిల్ చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు మహిళా ద్రోహి అని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ విమర్శించారు.

Minister Anilkumar Yadav Speech

జగనన్న అమ్మ ఒడి రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈ రోజు అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ఒక్కో తల్లికి రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. జగనన్న కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని పక్క రాష్ట్రాలు కోరుతున్నాయని అనిల్ అన్నారు.