Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy inspects Polavaram Project ongoing works in West Godavari District ( Photo Wikimedia Commons facebook)

Amaravati, july 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు పర్యటనను వాయిదా (CM Jagan Polvaram Tour Cancelled) పడింది. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో, ఒక్కరోజు ముందుగా ఆయన పర్యటన వాయిదా పడినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO in Andhra Pradesh) వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఈ నెల 14న సీఎం జగన్ పోలవరం పర్యటనకు వెళ్లబోవడంలేదని తెలిపింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్ (CM YS Jagan) భావిస్తున్నారు. అందుకే రేపు పోలవరం సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో, తిరిగి ఎప్పుడు పోలవరం వెళ్లాలనేది తదుపరి నిర్ణయించనున్నారు. తొలుత సీఎం పర్యటన వాయిదా పడిందని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మరోరోజు ఆయన పోలవరం వెళతారని వార్తలు వచ్చాయి.

ఏపీలో 27 వేల దిగువకు పడిపోయిన యాక్టివ్ కేసులు, కొత్తగా 3,034 మంది డిశ్చార్జ్, గత 24 గంటల్లో 2,567 కేసులు నమోదు, రాష్ట్రంలో ప్రస్తుతం 26,710 యాక్టివ్‌ కేసులు

సీఎం పోలవరం పర్యటనపై ఆయన కార్యాలయం ఇచ్చిన అధికార ప్రకటనలో మాత్రం ఏకంగా పర్యటన రద్దయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు, మూడు జిల్లాల కలెక్టర్లకు సమాచారాన్ని చేరవేసిన సీఎంవో.. పర్యటన రద్దుకు గల కారణాలను మాత్రం ప్రకటనలో పేర్కొనలేదు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్ భావిస్తుండటం, వర్షాకాలం ఉపందుకోనున్న వేళ, ప్రాజెక్టును సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.