Andhra Pradesh CM YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati, June 26: ఏపీ ప్రభుత్వం (AP Govt) మరోసారి రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకునే దిశగా అడుగులు వేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra pradesh CM YS Jagan) గత సర్కారు పెండింగ్ లో పెట్టిన రబీ బీమా పంట సొమ్మును (Pending Rabi Crop Insurance) రైతులకు చెల్లించారు. 2018 రబీ పంటల బీమా సొమ్ముకు (Crop Insurance) గానూ ఏపీ ప్రభుత్వం రూ. 596.36 కోట్లను విడుదల చేసింది. పేదలకు ఉచితంగా ఇసుక సరఫరా, ఇసుక కొరతపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, ఇకపై ఎడ్లబళ్లపై, ట్రాక్టర్లపై సొంత అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకువెళ్లవచ్చు

13 జిల్లాల్లోని 5,94,005 మంది రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు నేరుగా వారి అకౌంట్లలో ఈ డబ్బును జమ చేశారు. ఈ డబ్బును పాత అప్పులకు జమచేసుకోకుండా అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో ఈ బీమా డబ్బును జమ చేస్తున్నారు. కాగా 2019-20 నుంచి రైతులకు ఉచితంగా వైఎస్‌ఆర్‌ రైతు బీమా (YSR Rythu bheema) అమలవుతోంది. ఈ బీమా పరిహారం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ పుట్టిన రోజున ఏపీ సీఎం భారీ గిఫ్ట్, పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు

ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 2019–2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్‌ పంటల బీమా అమలు చేస్తామని తెలిపారు. అదే విధంగా రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని పునురుద్ఘాటించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Here's AP CMO Tweet

రైతు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్‌ నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా.. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్‌ కలిసి ఇ– క్రాపింగ్‌ రిజిస్టర్‌ చేసి.. వెంటనే ఇన్సూరెన్స్‌ను కట్టేలా ఏర్పాటు చేస్తారన్నారు. ఏపీ ప్రభుత్వం మరో సంచలన పథకం, మూగ జీవాల కోసం వైఎస్సార్‌ పశు సంరక్షణ స్కీం, మూగజీవాలకు ఆరోగ్య రక్షణ కార్డులు మంజూరు

రైతులు రూపాయి కడితే వారి తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాగా పంటల బీమాను ఇ–క్రాప్‌తో‌ అనుసంధానించడం ద్వారా ఖరీఫ్‌ 2019లో 25.73లక్షలు.. 2019–20 రబీలో 33.03 లక్షల మందికి మొత్తంగా 58.76లక్షలమందికి ఉచితంగా పంటల బీమా సౌకర్యం అందనుంది.