
Amaravati, June 26: పరిపాలనులో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇసుక పాలసీలో (Andhra Pradesh sand policy)పలు సవరణలు చేసి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇక నుంచి సొంత అవసరాలు, పేదల గృహ నిర్మాణం, సహాయ పునరావాస ప్యాకేజీలకు (weaker sections) ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చని స్పష్టం చేసింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది.1,2,3 ఆర్డర్ రీచ్‌లలో మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పింది. ఇసుక విధానంపై స్పష్టతనిస్తూ..అనుమతి ఉన్న రిచుల్లో ఎడ్లబళ్లపై సొంత అవసరాలకు ఉచితంగా తీసుకెళ్లొచ్చని, ట్రాక్టర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కాలేదు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నాం, విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి
బలహీన వర్గాల గృహ నిర్మాణం, సహాయ, పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన పనులకు ఉచితంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లేందుకు కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. వేరే చోట నిల్వ చేసి, విక్రయిస్తే చర్యలు తీసుకుంటారు. సొంత అవసరాలకే ఎడ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా నిబంధనలు అమలు చేయనున్నారు. ఎవరైనా సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లానుకుంటే గ్రామ, వార్డు సచివాలయాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 వరకు ఏపీ హైకోర్టు విధులు నిలిపివేత, సర్క్యులర్ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్, ఉద్యోగులపై పలు నిబంధనలు విధించిన న్యాయస్థానం
అనుమతి కోరిన వారి వివరాలు నమోదు చేసుకుని, ఎలాంటి ఫీజు లేకుండా సచివాలయాలు అనుమతి పత్రం ఇస్తాయి. అలాగే కలెక్టర్ బాధ్యతలు అప్పగించిన మరో అధికారి అయినా అనుమతి ఇవ్వొచ్చు. ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు.
హౌసింగ్ స్కీమ్, ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ గృహ నిర్మాణాలకు కూడా ఉచితంగా ఇసుక సరఫరా (Andhra pradesh sand policy) చేసే విధంగా ప్రభుత్వం పలు సవరణలను చేసింది. కాగా, వంకలు, వాగులు, యేర్లలోని ఇసుకను స్థానిక అవసరాలకు పేదలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే వెసులుబాటును కల్పించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.