CM-YS-jagan-Review-Meeting

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి.. 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రి 9:15 గంటలకు ఢిల్లీ చేరుకుని జన్‌పథ్‌-1లోని నివాసంలో రాత్రి బస చేయనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రధానితో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

పలాసలో తీవ్ర ఉద్రిక్తత, నారా లోకేష్‌ని అడ్డుకున్న పోలీసులు, మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్, అక్రమ నిర్మాణాల కూల్చివేతను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలిపిన అధికారులు

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనే ప్రధాన లక్ష్యంగా భేటీలో చర్చకు రానుంది. అలాగే, నిర్వాసితులకు సీఎం జగన్‌.. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని కోరనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలను అమలు చేయాలని సీఎం కోరనున్నారు.