Coronavirus in India | (Photo Credits: PTI)

Amaravati, May 8: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Coronavirus) శుక్రవారం కొత్తగా 54 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో (AP Coronavirus) మొత్తం కేసుల సంఖ్య 1,887కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల ముగ్గురు మృతి చెందారు. కర్నూలులో ఇద్దరు, విశాఖలో ఒకరు చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 41 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1004 మంది కరోనా రోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌-19 నుంచి కోలుకొని 842 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ముంబై సెంట్రల్ జైలులో కరోనా కల్లోలం, 77మంది ఖైదీలకు,26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్, దేశ వ్యాప్తంగా 56 వేలు దాటిన కరోనా కేసులు

అనంతపురం(16), విశాఖ(11), పశ్చిమ గోదావరి(9), కర్నూలు(7), కృష్ణా(6), చిత్తూరు(3) జిల్లాల్లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కో కొత్త కేసు నమోదైంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 547 కరోనా బాధితులు ఉన్నారు. కాగా గత 24 గంటల్లో 7,320 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 54 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,56,681 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Here's AP Corona Report

కర్నూలులో రోజు రొజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్‌(COVID–19)ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు కర్నూలులో జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గురువారం.. ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లోని అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.