
Amaravati, April 21: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసుల పెరుగుదలతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 39,619 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 9,716 కేసులు నిర్థారణ (AP coronavirus) అయ్యాయి.
గత 24 గంటల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,83,808 కరోనా బారీన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే 9,16,090 డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఇప్పటివరకు కరోనాతో 7,510 మంది (Coronavirus Deaths) మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 60,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనా వల్ల కృష్ణాలో 10 మంది, నెల్లూరులో ఏడు మంది, తూర్పుగోదావరిలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు మరణించారు.
గత 24 గంటల్లో శ్రీకాకుళంలో అత్యధికంగా 1444 కేసులు నమోదు కాగా గుంటూరులో 1236 కేసులు, చిత్తూరులో 1180 కేసులు నమోదు అయ్యాయి. అత్యల్పంగా వెస్ట్ గోదావరిలో 106 కేసులు నమోదయ్యాయి. జిల్లాల పరంగా చూస్తే అనంతపూర్ లో 849, ఈస్ట్ గోదావరిలో 830, కడపలో 216, కృష్ణాలో 294, కర్నూలులో 958, నెల్లూరులో 934, ప్రకాశంలో 294, విశాఖపట్నంలో810, విజయనగరంలో 565 కేసులు నమోదయ్యాయి.