Amaravati,Sep 19: ఏపీ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 10,820 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌తో (AP Covid Report) కోవిడ్ విజేతల సంఖ్య 5,30,711కు చేరుకుంది. గత 24 గంటల్లో 74,595 శాంపిళ్లను పరీక్షించగా, 8,218 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus (COVID-19) cases) తేలింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్టుల సంఖ్య 50,33,676కు చేరుకోగా, మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 617776కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 81763 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 58గా (Coronavirus deaths) నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5302కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
కొత్తగా చిత్తూరు 9, కృష్ణా జిల్లాలో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. ప్రకాశం 4, విశాఖ 4, తూర్పుగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు మృతి చెందారు.
ఇక ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్ -19 రికవరీలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రికవరీల్లో అమెరికాను అధిగమించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 42 లక్షలు దాటిందని వెల్లడించింది. వైరస్‌ను గుర్తించేందుకు ప్రభుత్వం సకాలంలో తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యలవల్లే ఇది సాధ్యపడిందని తెలిపింది.
గత 24 గంటల్లో 93,337 కొత్త కేసులు, 1,247 మరణాలు సంభవించాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య 53 లక్షలను దాటిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 10,13,964 యాక్టివ్ కేసులు ఉండగా, 42,08,432 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వివరించింది. మహమ్మారి వల్ల ఇప్పటివరకూ 85,619 మంది చనిపోయినట్లు తెలిపింది.