Purnananda Swamy (Credits: Twitter)

అత్యాచారం కేసులో పూర్ణానంద రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. ఇక, మైనర్లపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు రావడంతో దిశ పోలీసులు పూర్ణానందను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 17వ తేదీన దిశ పోలీసులు.. ఐడెంటిఫికేషన్‌ టెస్టు పెరేడ్‌ను నిర్వహించనున్నారు. కాగా, ఇద్దరు మైనర్లపై అత్యాచారం జరిగినట్టు ఫోరెన్సిక్‌ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. మరోవైపు.. ఈ కేసులో దిశ పోలీసులు.. అన్ని సైంటిఫిక్‌ ఆధారాలను సేకరిస్తున్నారు.

బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు పూర్ణానందను అరెస్ట్ చేసిన సంగతి విదితమే. రిమాండ్‌ రిపోర్టులో దిశ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పోలీసులు రిపోర్ట్‌ ప్రకారం.. పూర్ణానంద అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు. బాలికలను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది.

చికెన్ బదులు వంకాయ కూర వండిందని భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మరో ఘటనలో పెళ్లయిన పది రోజులకే నవవధువు ఆత్మహత్య

పూర్ణానంద ఇద్దరు బాలికలను అత్యాచారం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. బాలికలు గర్భం దాల్చకుండా పూర్ణానంద వారికి ట్యాబ్లెట్స్‌ ఇచ్చేవాడు. ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. బాలికలపై అత్యాచారం జరిగినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో వెల్లడైనట్టు తెలిపారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలికను ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు.