Visakha, August 8: విశాఖలో మళ్లీ డ్రగ్స్ వ్యవహారం (Drug Racket Busted in Vizag) కలకలం రేపింది. నెలరోజుల కిందట 61 ఎల్‌ఎస్‌డీ బోల్డ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, తాజాగా గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తెచ్చి విక్రయిస్తున్న ముఠాలోని ఐదుగురు సభ్యులను యాంటీ నార్కోటిక్ సెల్ అధికారులు అరెస్టుచేశారు. వారి నుంచి 50 ఎల్‌ఎ్‌సడీ బోల్ట్స్‌తోపాటు (50 LSD blots, MDMA seized, five arrested) ఎండీఎంఏ పౌడర్‌గా అనుమానిస్తున్న 4.4 గ్రాముల తెల్లని పౌడర్, ఒక కారు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
దీనికి సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. నగరంలోని ఎన్‌ఏడీ కొత్తరోడ్డు ప్రాంతానికి చెందిన పంగి రవికుమార్ (23) ఏజెన్సీ నుంచి గంజాయిని గోవా తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు. అక్కడ దిలీప్ అనే వ్యక్తి నుంచి సింథటిక్ డ్రగ్స్‌ను కొనుగోలుచేసి నగరానికి తెచ్చి విక్రయిస్తుంటాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో గోవా నుంచి 50 ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్, ఎండీఎంఏగా అనుమానిస్తున్న పౌడర్‌ను నగరంలో విక్రయించేందుకు రంగం సిద్ధం చేశాడు.
అయితే ముందస్తు సమాచారం మేరకు కమిషనర్ ఆదేశాలతో యాంటీ నార్కోటిక్ డ్రగ్ సెల్ అధికారులు శనివారం రాత్రి రైల్వేస్టేషన్‌లో మాటువేసి రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ విక్రయిస్తున్న నగరంలోని గోపాలపట్నంకు చెందిన ఓరుగంటి వాసుదేవ కటణ్య (32), సీతంపేటకు చెందిన మల్లాది మోజెస్ (25), 104 ఏరియాకు చెందిన అప్పికొండ యాద కిశోర్ (26), మర్రిపాలెంనకు చెందిన మారె సందీ్‌పను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 50 ఎల్‌ఎ్‌సడీ బోల్ట్ట్స్, 4.4 గ్రాములు పౌడర్, ఐదు సెల్‌ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. దిలీప్‌ను అరెస్టు చేయాల్సి ఉందని సీపీ తెలిపారు.డ్రగ్స్ ప్యాకెట్ ధర రూ.500 నుంచి రూ.1,500 వరకు ఉంటుందని, ఎండీఎంఏ పౌడర్ గ్రాము ధర రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు ఉంటుందని పోలీసులు వివరించారు.
వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ గ్రూపుల ద్వారా డార్క్ వెబ్‌సైట్ ఉపయోగించుకుని క్రిప్టోకరెన్సీ, యూపీఐ పేమెంట్స్ చేస్తూ పోస్టల్, ప్రైవేట్ కొరియర్స్ ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారం అంతా ఆన్‌లైన్‌లో జరుగుతోందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.ముఠా గుట్టు రట్టు చేసే ప్రయత్నం సాగుతోందని చెప్పారు. ఇవన్నీ చూస్తూంటే డ్రగ్స్ కి విశాఖ ఒక ముఖ్య రవాణా కేంద్రంగా మారుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.