
ఏపీ సార్వత్రిక ఎన్నిక ఫలితాల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళగిరి 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించి విజేతగా నిలిచిన లోకేశ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నుంచి ఇప్పటివరకూ పోటీ చేసిన అభ్యర్థులలో అత్యధిక మెజారిటీ 91,413 ఓట్ల రికార్డును ఆయన సాధించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేశ్ మొత్తం 1,67,710 ఓట్లు సాధించి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91,413 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పులివెందులలో వైఎస్ జగన్ విజయం, గతంతో పోలిస్తే తగ్గిన మెజారిటీ
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి రాజ్యాంగం అమలైన తర్వాత అప్పటి మదరాసు రాష్ట్రంలో భాగమైన మంగళగిరి నియోజకవర్గంలో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన డి లక్ష్మయ్య 17,265 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇదే ఇప్పటివరకూ మంగళగిరి నియోజకవర్గ అత్యధిక మెజారిటీ రికార్డు.