Vanga Geetha vs Pawan Kalyan (Photo-File Image)

Andhra Pradesh Election Results 2024 Live Updates: ఏపీ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో గెలుపెవరిది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అందరి దృష్టి పిఠాపురంపై ఉంది. పవన్ కళ్యాణ్‌కు పోటీగా.. వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును కాదని.. కాపు సామాజికవర్గానికే చెందిన వంగా గీతను బరిలోకి దింపింది. అంతే కాదు.. ఎన్నికల ప్రచారం చివరి రోజున పిఠాపురం వెళ్లిన జగన్.. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పిఠాపురం పోరు ఆసక్తికరంగా మారింది. 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో 86.63 శాతం పోలింగ్ నమోదైంది.

2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వర్మ ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఈసారి కూడా టికెట్ తనకే దక్కుతుందని ఆయన ధీమాతో ఉన్నప్పటికీ.. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో వర్మ సైడ్ అవ్వాల్సి వచ్చింది. చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇవ్వడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం ఎస్వీఎస్ఎన్ వర్మ విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే గెలుపెవరిది అనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.  వంగా గీత‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్, చివ‌రి రోజు ఎన్నిక‌ల ప్ర‌చారంలో కీల‌క హామీ ఇచ్చిన జ‌గ‌న్

1989 నుంచి పిఠాపురంలో జరిగిన గత ఏడు ఎన్నికల్లో ఒకసారి గెలిచిన నేత మరోసారి గెలవలేదు. 1951లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాతి నుంచి కాంగ్రెస్ నేత యల్లా సూర్యానారాయణ మూర్తి, టీడీపీ నేత వెన్నా నాగేశ్వర రావు మాత్రమే పిఠాపురం ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచారు. పిఠాపురంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదనే సెంటిమెంట్‌ ఉండేది. అయితే 2019లో వైఎస్సార్సీపీ ఈ సెంటిమెంట్‌ను చెరిపేసింది.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు ప్రత్యర్థిగా ఉన్న వంగా గీత 2009లో ప్రజారాజ్యం తరఫున ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్‌ఎన్ వర్మపై ఆమె 1,036 ఓట్ల తేడాతో గెలిచారు. వంగా గీతకు 46,623 ఓట్లు రాగా.. వర్మకు 45,587 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి ముద్రగడ పద్మనాభం 43,431 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు.  నువ్వు నిలబడితే నీకు ఓటు వేస్తాం కానీ పవన్ కి వెయ్యము, వీడియో ఇదిగో, జనసేనాధినేతకు షాకిస్తున్న SVSN Verma అనుచరులు

2014 ఎన్నికల్లో తనను కాదని పీవీ విశ్వంకు టీడీపీ టికెట్ కేటాయించడంతో.. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిపొందారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి దొరబాబుపై 47 వేల ఓట్ల తేడాతో వర్మ విజయం సాధించగా.. టీడీపీ అభ్యర్థి విశ్వం 15,187 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఎన్నికల అనంతరం వర్మ టీడీపీలో చేరారు.

2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు 83,459 ఓట్లు పడగా, టీడీపీ అభ్యర్థి వర్మకు 68,467 ఓట్లు పడ్డాయి. జనసేన నుంచి పోటీ చేసిన మాకినేడు శేషు కుమారి 28 వేల ఓట్లు పొందారు.