AP Elections Results 2024

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 5.15 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉద్యోగులు, అత్యవసర సర్వీసు సిబ్బంది 4,61,945 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 26,721 మంది ఉన్నారు.వయోవృద్ధులు, దివ్యాంగులు 26,473 మంది ఉండగా.. కౌంటింగ్‌ సైన్యం.. విధుల్లోని ఉద్యోగులు 25,209 మంది ఉన్నారు. అబ్జర్వర్లు 119 కాగా.. పోలీసులు 42,000 మందిని నియమించారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉన్నారు. టేబుళ్లు (అసెంబ్లీ) 2,446 కాగా.. పార్లమెంటు కోసం 2,443 ఏర్పాటు చేశారు.  వంగా గీత గెలిచి డిప్యూటీ సీఎం అవుతారా? పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడతారా ? పిఠాపురం లెక్కలు ఎలా ఉన్నాయంటే..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో పోలీసులుభారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కుప్పంలో దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో, అందరూ దుకాణాలను మూసేశారు.