Chandrababu Slams CM Jagan: సైకో జగన్‌ని శాశ్వతంగా ఇంటికి పంపండి, డోన్‌ ప్రజాగళం సభలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Chandrababu Naidu (photo/X/TDP)

పట్టాదారు పాసుపుస్తకంపై జగన్‌ తన ఫొటో వేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజల భూములను జగన్‌ పేరుతో రాసుకుంటున్నారని ఆరోపించారు. తన భూములను ఇతరుల పేరిట మార్చారని తీవ్ర ఆవేదనకు గురై ఓ చేనేతకారుడు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులూ చనిపోయారన్నారు. నంద్యాల జిల్లా డోన్‌లో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ద్వారా జగన్‌.. ప్రజల ఆస్తులు కొట్టేసే యత్నం చేస్తున్నారని విమర్శించారు.  నవ్వుతూ ఉండే ఆ తండ్రి లేని బిడ్డ ఫొటో మనకెందుకు,సీఎం జగన్‌పై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

సైకో జగన్ కు తెలిసిందల్లా రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, కేసులు... ఇవి కాకుండా ఒక్క మంచి పని చేశాడా? నేను నందికొట్కూరు నుంచి సవాల్ విసురుతున్నా. నేనేం చేశానో చెబుతున్నా. ఈ జిల్లాను తీసుకుంటే... తంగడంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు ముందుకెళ్లాను. అది వచ్చుంటే రైతులకు ఆదాయం పెరిగేది, మీరు పండించే పంట విత్తనాలుగా మారి ప్రపంచానికి వెళ్లుంటే మీ ఆదాయం పెరిగి పరిశ్రమలు వచ్చేవి. ఈ యువత ఎక్కడికీ వెళ్లే పనిలేకుండా మీ ఊర్లోనే ఉద్యోగాలు వచ్చేవి.

ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు. యువత, రైతులు, బీసీలు, ముస్లింలు, మహిళలు... ఇలా ఏ వర్గం వారు కూడా ఆనందంగా లేరని అన్నారు. ఏమిటీ చెత్త పరిపాలన అంటూ విమర్శించారు. అమెరికాలోనే బెస్ట్ విద్యాసంస్థ అయోవా యూనివర్సిటీ. ఆ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. కానీ ఈ దుర్మార్గుడు, దుష్టుడు ఆ ఎంఓయూ నేను చేశానన్న కారణంతో మీ పొట్టకొట్టాడు.  పోయేకాలం వస్తే హీరో విలన్లకి బచ్చాలానే కనిపిస్తాడు, చంద్రబాబు బచ్చా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన సీఎం జగన్

రూ.365 కోట్లతో జైన్ ఇరిగేషన్ కు ఒక ప్రాజెక్టు ఇచ్చాం. ఆ ప్రాజెక్టుతో నర్సరీ మొత్తం తయారుచేసి, ఆదర్శప్రాయమైన మైక్రో ఇరిగేషన్ తో రాయలసీమను హార్టికల్చర్ గా మార్చి మీ ఆదాయాన్ని రెట్టింపు చేయాలని భావించాను. కానీ ఈ రోజు జైన్ ఇరిగేషన్ వచ్చిందా? ముచ్చుమరి ప్రాజెక్టు పూర్తి చేసింది ఎవరు? ఇలాంటి ప్రాజెక్టులు ఒకటీ రెండు కాదు.

మరోవైపు ఓర్వకల్లు. నేనే ఒక్క సంవత్సరంలో ఎయిర్ పోర్టు కట్టించాను. ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా వెళ్లేందుకు ప్రణాళికలు రచించాను. సోలార్ పార్క్, విండ్ మిల్స్, పంప్డ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాను. ఇవాళ ఇవన్నీ వచ్చాయా? ఇవన్నీ గనుక వచ్చుంటే హైదరాబాద్ కు నందికొట్కూరు ఒక శాటిలైట్ టౌన్ షిప్ మాదిరిగా తయారయ్యేది. కానీ ఈ రాయలసీమ ద్రోహిని, నందికొట్కూరును నాశనం చేసిన వ్యక్తిని మీరు క్షమిస్తారా? ఈ జగన్ ఒక సైకో, ఒక అహంకారి, విధ్వంసకారుడు. ఊరికొక సైకోను తయారుచేశాడు. ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఉన్నాడు.

ముఖ్యమంత్రిగా ఉండేందుకు జగన్ కు అర్హత ఉందా? పరిపాలన చేతకాని వ్యక్తి జగన్. డ్రైవింగ్ చేతకాని వ్యక్తికి మీరు డ్రైవింగ్ అప్పగించారు. అసలే డ్రైవింగ్ తెలియదు, రివర్స్ గేర్ లో తీసుకెళుతూ అందరి జీవితాలను నాశనం చేస్తున్నాడు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

మహాశక్తి కింద 4 కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘‘మహిళల నిధి కింద నెలకు రూ.1500 అందజేస్తాం. తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తాం. మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. డ్వాక్రా సంఘాల్లో మహిళలను లక్షాధికారులను చేస్తాం. ఒక్కో సంఘానికి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. మహిళలను ప్రతి ఇంటికి ఆర్థిక మంత్రిగా చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.