CM Jagan Slams Chandrababu: పోయేకాలం వస్తే హీరో విలన్లకి బచ్చాలానే కనిపిస్తాడు, చంద్రబాబు బచ్చా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన సీఎం జగన్
CM Jagan (Photo-X/YSRCP)

Ponnur, April 29: గుంటూరు పొన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్‌ మోహన్ రెడ్డి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు ఎలాంటివాడో చెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుందని మండిపడ్డారు. విలువలు, విశ్వసనీయత లేని బాబు.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని విమర్శించారు.

మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందన్నారు. ఈ యుద్ధంలో ఓ వైపు కౌరవ సేన, దృష్ట చతుష్టయం ఉందని విమర్శించారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిని దుయ్యబట్టారు. ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఉన్నాయని ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు

పేదవాడికీ మేలు చేసిన చరిత్రలేని వీళ్లంతా కూటమిగా చేరి ఇంటింటికీ మంచి చేసిన ఒకే ఒక్కడైన మీ జగన్‌తో యుద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ నమ్ముకున్నది మిమ్మల్ని(ప్రజలు), పైనున్న ఆ దేవుడినే అని తెలిపారు. జగన్‌ పొత్తు ప్రజలతోనే ఉంన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లకు ప్రజల ఇంటి అభివృద్ధిని నిర్ణయించేవన్నారు. పేదల తలరాతలను నిర్ణయించేవని చెప్పారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పతకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు.

చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. పోయేకాలం వచ్చినప్పుడు విలన్‌లందరికీ హోరో బచ్చాలనే కనిపిస్తాడు.నువ్వు బచ్చా అంటున్న నేను ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి ధైర్యంగా పొరాడుతున్నా.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేకపోతున్నాడు.చంద్రబాబు పేరు చెబితే గుర్తు వచ్చే ఒక్కమంచి పథకం అయినా ఉందా? బచ్చా అంటున్న జగన్‌ను చూసి.. బాబు ఎందుకు బయపడుతున్నాడు?బచ్చాను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తు ఎందుకుచంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు? అంటూ మండిపడ్డారు.

అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, పెన్షన్‌ వంటి పథకాలు నువ్వు ఎందుకు చేయలేదు? ఐదేళ్లలో నేను అమలు చేసిన పథకాలనే అమలు చేస్తానని ఎందుకు చెబుతున్నావు? రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా? గత మేనిఫెస్టోలో చెప్పినవి 99 శాతం హామీలు అమలు చేశాం.లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాం.నాడు-నేడుతో విద్యా, వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చాం.31 లక్షల ఇళ్ల పట్టాలు,. 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.నా కేబినెట్‌లో‌ 68శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు.58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చా.పేదల భవిష్యత్తు మరో రెండడుగులు ముందుకు వేసేలా 2024 మేనిఫెస్టో అని సీఎం అన్నారు.