
PM Narendra Modi Andhra Pradesh Schedule: ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్‌డీఏ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. ఈ నెల 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బీజేపీ బుధవారం ప్రధాని ఎన్నికల ప్రచార పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం ఎన్‌డీఏ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి తరఫున వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో ప్రధాని పాల్గొంటారు. ఇక 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీలేరు సభకు హాజరవుతారు. రాత్రి 7 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. పిల్లలు ఎక్కువ మంది పుట్టకుండా కండోమ్‌లు వాడేది ముస్లింలే, ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన అసదుద్దీన్ ఒవైసీ
ఇక తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణలో జహీరాబాద్ సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మే 3న వరంగల్ లోక్ సభ పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అదే రోజున నల్గోండ, భువనగిరి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ సభల్ ప్రధాని ప్రసంగించనున్నారు. మే 4న నారాయణ పేట, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని బీజేపీ తెలంగాణ శాఖ వెల్లడించింది. ఇంకెంత కాలం మసీదులు, దేవాలయాల పేరుతో ఓట్లు అడుగుతారు, ప్రధాని మోదీపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
మే 13న జరగబోయే 96 లోక్ సభ సీట్లకు 4వ విడతలో భాగంగా ఎలక్షన్స్ జరగనున్నాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు అటు ఏపీలోని 25 లోక్ సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.ఏపీ, తెలంగాణతో పాటు అటు బిహార్ రాష్ట్రంలోని 5 స్థానాలు.. మధ్య ప్రదేశ్‌లోని 8 స్థానాలు.. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్.. మహారాష్ట్రలోని 11 లోక్ సభ స్థానాలు.. ఒడిశాలోని 4 స్థానాలు..ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 స్థానాలు. పశ్చిమ బంగాల్‌లోని 8 స్థానాలు.. జార్ఘండ్‌లోని 4 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.