Andhra Pradesh Elections 2024: పులివెందులలో సీఎం జగన్‌ తరఫున నామినేషన్ దాఖలు, ఈ నెల 25వ తేదీన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి
YS jagan memantha-siddham-(photo-X/YSRCP)

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున నామినేషన్‌ దాఖలు అయ్యింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సోమవారం సీఎం జగన్‌ తరఫున ఒక సెట్‌తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ నేతలు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున ఇవాళ ఒక సెట్ నామినేషన్ వేశాం. ఈ నెల 25వ తేదీ ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. 25వ తేదీ ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. మద్యాహ్నాం తర్వాతే ఆయన నామినేషన్‌ వేస్తారు. రాష్ట్రంలో 70 శాతం ప్రజలు సీఎం జగన్‌ వైపే మళ్లీ చూస్తున్నారు. రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని వైఎస్‌ మనోహర్‌రెడ్డి అన్నారు.  ఏపీ నుంచి మరో 38 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌, పూర్తి లిస్టు ఇదిగో..

ప్రస్తుతం సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్నారు. ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా 2 వేల కిలోమీటర్లు యాత్ర పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 21 జిల్లాలో సాగింది. బస్సు యాత్ర ముగిసిన వెంటనే.. మరో సెట్‌తో సీఎం జగన్‌ స్వయంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్‌ వేస్తారు. ఈ నెల 25వ తేదీన నామినేషన్ల దాఖలు చివరి తేదీ అని తెలిసిందే.