AP Floods 2021: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం, వరదల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్, రేపు వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
YS Jagan Kadapa Visit (Photo-Twitter)

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి (CM YS Jagan) పర్యటిస్తున్నారు. వైఎస్సార్‌ కడప, చిత్తూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. వరద బాధితులతో నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్‌ తెలిపారు.

వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని చెప్పారు.​ వరదలతో (andhra-pradesh Floods) చాలా నష్టం జరిగిందనే విషయాన్ని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారని సీఎం జగన్‌ కొనియాడారు.రాజంపేట మండలంలో సీఎం జగన్‌ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రాజంపేట మండలం మందపల్లి, పులపుత్తూరులో వరద బాధితులను సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.

వీడియో..సీఎం జగన్ ముందు బోరున విలపించిన మహళలు, అంద‌రినీ ఆదుకుంటామ‌ని ధైర్యం చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి, వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం

భారీ వర్షాలు, వరదలతో ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. పులపుత్తూరులో 293 ఇళ్లు దెబ్బతిన్నాయని, వారికి ఇళ్లు మంజూరు అవుతాయని వెల్లడించారు.పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లిస్తామని, పొలంలో ఇసుక మేటలు తొలగించేందుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుక మేటల తొలగింపు కోసం హెక్టారుకు రూ.12 వేలు సాయం అందిస్తామని అన్నారు.

అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడనున్నాయి. మధ్య అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల మీదుగా అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం విస్తరించాయి. అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో జవాద్‌ తుపానుగా మారుతుందని, అనంతరం వాయువ్య దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి 4వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి చేరుకుంటుందని వివరించింది.

Here's AP CM Visit Visuals

దీనివల్ల ఉత్తర కోస్తాలో గురువారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం, శుక్రవారం మోస్తరు నుంచి ఉరుములతో కూడిన జల్లులు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో రెండు రోజులపాటు ఒకటి రెండుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. కాగా, 3, 4 తేదీల్లో తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కి.మీ., గరిష్టంగా 100 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగసిపడతాయన్నారు. ఈ నెల 5వ తేదీ వరకు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు.