Andhra Pradesh Formation Day 2021 (Photo-Twitter/YSRCP)

Amaravati, Nov 1; ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు (Andhra Pradesh Formation Day 2021) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌, ఆదిమూలపు సురేష్, శంకరనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, తానేటి వనిత, గుమ్మనూరి జయరాం, అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్ పాల్గొన్నారు.

అమరజీవి త్యాగం నుంచి నేటి వరకు ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చరిత్ర ఏమిటీ, పెద్దమనుషుల ఒప్పందం, శ్రీబాగ్ ఒడంబడిక అంటే ఏమిటీ, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంపై ప్రత్యేక కథనం

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

Here's YSR Congress Party Tweet

అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు.

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఏపీ ప్రజలు గట్టి పట్టుదల కలిగినవారని, అందుకే అన్ని చోట్ల రాణిస్తున్నారంటూ ట్వీట్

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున నివాళర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మహనీయుడి స్పూర్తి కొనసాగాలనే సీఎం జగన్.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్నారన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని టీడీపీ ప్రభుత్వం జరపలేదని.. అప్పట్లో వేడుకలు జరపకుండా ఇప్పుడు అచ్చెన్నాయుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు.