
Amaravati, Dec 21: ఏపీ సర్కారు కోవిడ్ వ్యాక్సిన్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కసరత్తు కోసం అర్బన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు (Urban Task Force for distribution of coronavirus vaccine) చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మున్సిపల్‌శాఖ కమిషనర్ ఛైర్మన్‌గా 9 మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. టాస్క్‌ఫోర్స్ కమిటీ ఉత్తర్వుల్లో సవరణలు చేసింది.
స్టేట్ టాస్క్ ఫోర్స్ లో మరో ఆరుగురు సభ్యులకు స్థానం కల్పించింది. జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో మరో 31 మంది అధికారులు సభ్యులుగా ప్రభుత్వం పేర్కొంది. కొత్త సవరణలతో స్టేట్ టాస్క్‌ఫోర్స్ సభ్యులుగా 16 మంది, జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యులుగా 34 మందిని నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య (Coronavirus in AP) భారీగా తగ్గింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 214 కేసులు మాత్రమే నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 46 కేసులు, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 4 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
ఇదే సమయంలో 422 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,78,937కి చేరుకున్నాయి. మొత్తం మరణాలు 7,078కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,992 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 8,67,867 మంది కరోనా నుంచి కోలుకున్నారు.