Vjy, Mar 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నిధుల్ని లబ్ధదారుల ఖాతాల్లో జమచేశారు. మొత్తం 4,19,583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు.
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ బనగానపల్లె నుంచి చేస్తున్నాం. పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వైఎస్సార్ ఈబీసీ నేస్తంగానీ, వైఎస్సార్ కాపు నేస్తంగానీ మేనిఫెస్టోలో పెట్టినవి కావు. ఈ నెల 16న మొత్తం అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్న సీఎం జగన్, అనంతరం ఎన్నికల ప్రచారంలోకి..
అయినా వారికి త తోడుగా ఉండాలని, పేదరికం వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని వారి కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఈరోజు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,19,528 మంది నా అక్కచెల్లెమ్మలకు 629 కోట్లు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తున్న ఈ సొమ్ముతో కలుపుకొంటే మూడు దఫాల్లో 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ రూ.1877 కోట్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా మంచి చేయగలిగాం. వైసీపీ తాజా అభ్యర్థుల 12వ లిస్టు ఇదిగో, గాజువాక ఇన్ఛార్జీగా గుడివాడ అమర్ నాథ్, చిలకలూరిపేట ఇన్ఛార్జీగా కావటి మనోహర్ నాయుడు
అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ గానీ, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలపంపిణీ, అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్, ఇళ్లు కట్టించే కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇవన్నీ కూడా నా అక్కచెల్లెమ్మలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలని ఎక్కడా కూడా కులం చూడటం లేదు.
Here's Videos
బాబు, దత్తపుత్రుడు, బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే.. అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారు.
2014లో అధికారంలోకి వచ్చాక @ncbn సంతకం పెట్టిన మేనిఫెస్టోలో ఒక్క హామీ అయినా అమలు చేశారా?
-సీఎం @ysjagan #MosagaduBabu#PackageStarPK pic.twitter.com/M3VMnvgpv3
— YSR Congress Party (@YSRCParty) March 14, 2024
2014లో కూడా ఇదే @ncbn, @PawanKalyan, @BJP4Andhra కలిసి మోసపూరిత హామీలు ఇచ్చారు. ఇప్పుడూ అదే తరహా హామీలతో ముందుకు వస్తున్నారు.
-సీఎం @ysjagan #MosagaduBabu#TDPJSPCollapse pic.twitter.com/LdUhXLvCmt
— YSR Congress Party (@YSRCParty) March 14, 2024
వర్గం, మతం, ప్రాంతం, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారనేది కూడా చూడటం లేదుూ అర్హత ఉంటే చాలు.. ప్రతి అక్కచెల్లెమ్మకూ తోడుగా ఉంటూ ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేస్తున్నాం.సంక్షేమ పథకాల్లో సింహ భాగం నా అక్కచెల్లెమ్మల పేరుమీదే, వారి పేరు మీదే బ్యాంకు అకౌంటు తెరిచి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తున్న ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తున్నది కేవలం ఈ 58 నెలల కాలంలోనే.. మన గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్. ఒకటో తేదీ ఉదయం ఆదివారమైనా, సెలవుదినమైనా లెక్కచేయకుండా చిక్కటి చిరునవ్వుతో ఇంటికే వచ్చి మీ మనవడిలా, మనవరాలిలా తోడుగా ఉంటూ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈరోజు ప్రతి పథకం ప్రతి కుటుంబానికీ అందుతోంది.
3 సార్లు సీఎం అయిన చంద్రబాబు పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తొచ్చేది బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది.ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచీ గుర్తుకురాదు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రస్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. ఏదేండ్లకోకసారి కార్లు మార్చినట్లుగా భార్యలను మార్చే ఒక మ్యారేజీ స్టార్, ఓ వంచకుడు గుర్తుకొస్తాడు. ఒకరికి విశ్వసనీయత లేదు. మరొకరికి విలువలు లేవు. వీరు మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు.. కాదు కాదు.. మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీద యుద్ధానికి వస్తున్నారు.
ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కల్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెబుతున్న మోసపూరిత వాగ్దానాలు ఇదే మాదిరిగేనే స్టేజీ మీద కూర్చొని ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చారు. చంద్రబాబు సంతకం పెట్టి మరీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఇందులో ఈయన రాసిన మాటలు, వాగ్దానాలు.. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు.రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు 14205 కోట్లు మాఫీ చేస్తానని, నా అక్కచెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కథ దేవుడెరుగు.. విజయవాడలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు.
ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మీ పథకం కింద రూ.25 వేలు ఖాతాల్లోకి వేస్తానన్నారు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకుగానీ, మీకు తెలిసిన వారికిగానీ ఒక్కరికైనా రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లోకి డిపాజిట్ చేశాడా అని అడుగుతున్నా. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ రూ.2 వేల నిరుద్యోగభృతి. 5 సంవత్సరాలకు రూ.1.25 లక్షలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా?. ఈ మాదిరిగా పాంప్లేట్లు చూపించాడు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్నాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు. మేనిఫెస్టో అని తెచ్చాడు. అక్కచెల్లెమ్మలకు ఇందులో కొన్ని పేజీలు పెట్టాడు.ఈ బీజేపీ ముగ్గురూ కలిసి ఫొటోలు దిగి, మేనిఫెస్టో రిలీజ్ చేసి, సంతకాలు పెట్టి ఇంటింటికీ పంపిచాడు. ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? అని అడుగుతున్నా..
మన రామిరెడ్డి అన్న.. మీ అందరికీ పరిచయస్తుడే. నిరుడుకన్నా ఇంకా గొప్ప మెజార్టీతో ఆశీర్వదించమని కోరుతున్నా. అటువైపున టీడీపీ అభ్యర్థి చాలా ధనవంతుడు. చాలా డబ్బులున్నాయి.ఓటుకు రూ.2 వేలైనా రూ.3 వేలైనా ఇస్తాడు. రామిరెడ్డి అన్న ధనవంతుడు కాదు. ఆ మాదిరిగా ఇవ్వలేకపోవచ్చు. రామిరెడ్డి అన్నను గెలిపించిన తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు లెక్క తీస్తే ప్రతి అక్కచెల్లెమ్మకూ కూడా ఇన్ని పథకాల ద్వారా ఇన్ని లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలకు జమ అయ్యాయి. ఇవన్నీ జరిగేది కేవలం ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతాయన్నది మనసులో పెట్టుకోండి.
వాళ్లిచ్చే డబ్బులు రెండువేలిచ్చినా, మూడు వేలిచ్చినా వద్దనద్దండి. ఆనందంగా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు, బటన్ నొక్కేటప్పుడు మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అవుతాడన్నది మాత్రం గుర్తుపెట్టుకోండని సీఎం జగన్ కోరారు.