![](https://test1.latestly.com/wp-content/uploads/2020/07/APSRTC-380x214.jpg)
Amaravati, April 13: ఏపీలో బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ( MD Dwarka Thirumala Rao) మీడియాతో తెలిపారు. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. డీజిల్ బల్క్ రేటు విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చు కూడా రాకపోతే ఆర్టీసీ (APSRTC) పూర్తి నష్టాల్లోకి వెళుతుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో డిజీల్ సెస్ కింద పెంచాల్సి ( hikes bus fares) వస్తోందని పేర్కొన్నారు. పల్లెవెలుగు సర్వీసులపై రూ. 2 పెంపు ఉండనుంది. ఇకపై పల్లె వెలుగు బస్సుల్లో మినిమమ్ ఛార్జీ రూ. 10 గానిర్ధారించారు. ఎక్స్‌ప్రెస్ సర్వీసులపై రూ. 5 పెంచారు. ఏసీ బస్సుల్లో రూ. 10 పెంచారు.
తప్పనిసరి పరిస్థితుల్లో పెంపుదల తప్పట్లేదన్న ఆయన.. ఇది ఛార్జీల పెంపు కాదని గుర్తించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పెంచిన ధరలు రేపటి(ఏప్రిల్ 14) నుంచే అమలులోకి రానున్నాయి. ప్రయాణికులు అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. పల్లెవెలుగు కనీస ఛార్జీ ఇకపై రూ.10గా నిర్ణయించామని తెలిపారు. కరోనా వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండి పడిందని పేర్కొన్నారు.
ఆర్టీసీపై రోజుకు రూ.3.5 కోట్ల భారం పడుతోందని తెలిపారు. రెండేళ్లుగా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పెంపు నిర్ణయించామని తెలిపారు. డీజిల్ సెస్ మాత్రమే పెరుగుదల అని పేర్కొన్నారు.