Pension Distribution in AP: ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్‌, విధి విధానాలు ఇవిగో..
Pension Distribution in AP (Representational Image. Source: PTI)

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి(ఏప్రిల్‌3) పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 6 వరకు (మొత్తం నాలుగు రోజులు) పెన్షన్లను పంపిణీ జరగనుంది. అయితే సచివాలయ సిబ్బంది కొరత కారణంగా రెండు విధానాల్లో పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం విధివిధానాలు జారీ చేసింది.  ఒకటో తేదీ ఇంటికి రాని పెన్సన్, ఇద్దరు వృద్ధులు గుండెపోటుతో మృతి, ఎక్స్ వేదికగా ప్రతిపక్షాలపై వైసీపీ ఫైర్

సిబ్బంది కొరతతో రెండు కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్‌ అందించనుంది. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయనున్నాయి.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు.