Jagananna Chedodu Scheme: నేడు జగనన్న చేదోడు స్కీమ్ లాంచ్, కుల వృత్తుల వారికి ఏడాదికి రూ.10 వేలు, రూ.154 కోట్ల 31 లక్షలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
IPS Officers Transfers And Promotions In Andhra Pradesh (photo-Twitter)

Amaravati, June 10: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) నేడు జగనన్న చేదోడు పథకాన్ని లాంచ్ చేయనున్నారు. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఈ పథకం కింద ప్రభుత్వం అందజేయనుంది. వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ) సంక్షేమం కోసం ‘జగనన్న చేదోడు’ (Jagananna Chedodu Scheme) పేరుతో ఆర్థిక సహాయం అందించనున్నారు. ఏపీలో నాలుగు వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు, తాజాగా 147 కరోనా కేసులు నమోదు, 2403 మంది డిశ్చార్జ్‌

సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకానికి రూ.154 కోట్ల 31 లక్షలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు

షాపులున్న1,25,926 మంది టైలర్లకు రూ. 125,92,60, 82,347 మంది రజకులకు రూ. 82,34,70, 38,767 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 38,76,70 మొత్తం 2,47,040 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఈ లబ్దిదారులు వారి వృత్తికి అవసరమగు చేతి పనిముట్లు, చేతి పెట్టుబడి కోసం ఈ ఆర్దిక సాయాన్ని వినియోగించుకుని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.